ఐపీఎల్ జట్ల ఓనర్స్ ఎవరో తెలుసా!

First Published Dec 20, 2019, 6:29 PM IST

కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు

కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు 2020 ఐపీఎల్‌ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు.   ఇన్నిన్ని కోట్లు ఈ ఫ్రాంచైజీలు కుమ్మరిస్తుండడంతో... ఈ టీంల యజమానులు ఎవరు అనే చర్చ సర్వత్రా మొదలయ్యింది. ఈ చర్చ నేపథ్యంలో అసలు ఈ 8జట్ల ఓనర్స్ ఎవరో మీరు కూడా ఒక లుక్కేయండి.
undefined
ఐపిఎల్ 2020 లో సిఎస్‌కె యజమానులు మూడుసార్లు ఐపిఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బిసిసిఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్ సొంతం. CSK యజమాన్య బాధ్యతలు మొదట్లో ఇండియా సిమెంట్స్ చూసుకునేది. ఆ తరువాత ఇదే గ్రూప్ మరో కంపెనీ చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ అని ప్రారంభించి దానికి బదిలీ చేసింది.
undefined
ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్ యజమానులు నాలుగు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్) సొంతం. ఈ టోర్నమెంట్‌లో  ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా వీరు కొనసాగుతున్నారు.
undefined
ఐపీఎల్ 2020 లో ఆర్‌సిబి యజమాన్యం  2008 లో విజయ్ మాల్యా కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ అనే భారతీయ లిక్కర్ సంస్థ యాజమాన్యంలో ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో బెంగుళూరు అన్ని సీజన్లలో ఆడినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలిచింది లేదు.
undefined
ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమానులు రాయల్ ఛాలెంజర్స్ మాదిరిగానే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2008 లో ప్రారంభ సీజన్ నుండి ఆడినప్పటికీ కూడా ఒక్క ఐపిఎల్ టైటిల్ కూడా గెలవలేదు.  ‘కేపీహెచ్ డ్రీం క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ కింద ఈ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటి ప్రీటీ జింటా, నెస్ వాడియా (వాడియా గ్రూప్), మోహిత్ బర్మన్ (డాబర్ ఇండియా లిమిటెడ్), ది ఒబెరాయ్ గ్రూప్, కరణ్ పాల్ (అపీజయ్ సురేంద్ర గ్రూప్) కలిసి ఓనర్లుగా కొనసాగుతున్నారు.
undefined
ఐపీఎల్ 2020 లో రాజస్థాన్ రాయల్స్ యజమానులు 2008 లో ఐపిఎల్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి జట్టు రాజస్థాన్ రాయల్స్, ప్రధానంగా మనోజ్ బాదాలే ఈ జట్టు యజమాని. యువ ప్రతిభను అత్యధికంగా ప్రోత్సహిస్తారనే పేరుగాంచిన రాయల్స్ లో లాచ్లాన్ ముర్డోక్, ఆదిత్య ఎస్ చెల్లారామ్, సురేష్ చెల్లారాం వంటి ఇతర పెట్టుబడిదారులు కూడా ఉన్నారు.
undefined
ఐపీఎల్ 2020 లో కెకెఆర్ యజమానులు రెండుసార్లు (2012 మరియు 2014) ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్), బాలీవుడ్ నటి జూహి చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా (మెహతా గ్రూప్) సహా యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
undefined
ఐపీఎల్ 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానులు 2016 లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మీడియా అధిపతి కలానిధి మారన్ (సన్ టీవీ నెట్‌వర్క్) సొంతం చేసుకుంది.అంతకు ముందు దక్కన్ ఛార్జర్స్ గా కొనసాగిన టీం సన్ గ్రూప్ కొనుగోలు చేసిన తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ గా రూపాంతరం చెందింది.
undefined
ఐపీఎల్ 2020 లో క్యాపిటల్స్ యజమానులు ఇంతకు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ అని పిలిచేవారు, గత సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ గా రూపాంతరం చెందింది. ఈ ఫ్రాంచైజీ జిఎంఆర్ గ్రూప్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపిఎల్ 2019 కి ముందు ఈ ఫ్రాంచైజ్ తన 50% వాటాను జెఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్‌కు విక్రయించింది.
undefined
click me!