Virat Kohli : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు..

By Mahesh Rajamoni  |  First Published Apr 29, 2024, 1:57 AM IST

Virat Kohli IPL Records : గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన ఐపీఎల్ 2024 45వ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ లు త‌మ బ్యాటింగ్ తో దుమ్మురేపారు. 
 


Virat Kohli T20 Cricket Records : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 45వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్లు 400+ ప‌రుగులు సాధించాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. విల్ జాక్స్ సూప‌ర్ సెంచ‌రీ, విరాట్ కోహ్లీ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో 16 ఓవ‌ర్ల‌లోనే ఆర్సీబీ విజ‌యం అందుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. సాయి సుదర్శన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షారూఖ్ 58 పరుగులు చేశాడు. 201 పరుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బెంగళూరు బ్యాటింగ్ విధ్వంసం చూపిస్తూ కేవలం 16 ఓవ‌ర్ల‌లోనే విజయాన్ని అందుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీలు ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆరంభంలోనే డు ప్లెసిస్ 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

Latest Videos

CSK vs SRH Highlights: చెన్నైతుషార్ దేశ్‌పాండే దెబ్బకు తుస్సుమన్న హైదరాబాద్..

ఆ తర్వాత విరాట్ కోహ్లి, విల్ జాక్స్ ఇద్దరూ కలిసి గుజ‌రాత్ బౌలింగ్ ను చీల్చిచెండాడారు.  వీరిద్దరూ గుజరాత్ జట్టు బౌలింగ్‌పై దండ‌యాత్ర చేస్తూ ఫోర్లు, సిక్స‌ర్లు బాదారు. దీంతో బెంగళూరు జట్టు 16 ఓవర్లలో 206 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. విల్ జాక్స్ 41 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మ‌రో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ మ‌రో ఘ‌న‌త సాధించాడు.

ఇప్ప‌టికే ఆరెంజ్ క్యాప్ ద‌క్కించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్లో 500 పరుగులు దాటిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఈ సీజ‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడి 501 పరుగులు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్ లు ఆడి 71.43 యావ‌రేజ్,     147.49 స‌గ‌టుతో 500+ ప‌రుగులు కొట్టాడు. 46 ఫోర్లు, 20 సిక్స‌ర్లు బాదాడు. మొత్తంగా 7 ఐపీఎల్ సీజ‌న్ల‌లో 500+ ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. అంత‌కుముందు, ఢిల్లీ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఈ ఘ‌న‌త సాధించాడు. డేవిడ్ భాయ్ కూడా 7 సార్లు 500+ ప‌రుగులు కొట్టాడు.

CSK : టీ20 క్రికెట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రపంచ రికార్డు..

click me!