Chennai Super Kings : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 46వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో టీ20 క్రికెట్‌లో చెన్నై ఏ జట్టు సాధించని ప్రపంచ రికార్డు సృష్టించింది.
Chennai Super Kings : ఐపీఎల్ 2024లో 46వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (98 పరుగులు), డారిల్ మిచెల్ (52 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రపంచ రికార్డును సృష్టించింది.
బ్యాటింగ్ లో దుమ్మురేపిన చెన్నై
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అజింక్య రహానే 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అయితే 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ ఓ నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రితురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్ ఆడాడు కానీ, సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 98 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లలో శివమ్ దూబే ధనాధన్ షాట్లు కొట్టి 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ధోని కూడా చివరలో బౌండరీ బాదాడు.
సీఎస్కే సరికొత్త ప్రపంచ రికార్డు
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ను 78 పరుగుల తేడాతో చిత్తుచేసింది చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘనత సాధించింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. చెన్నై టీమ్ 35 సార్లు 200కు పైగా స్కోర్ చేసింది. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు సోమర్‌సెట్ జట్టు పేరిట ఉంది. ఇది 34 సార్లు 200+ స్కోర్ సాధించింది. ఇప్పుడు చెన్నై టీమ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. 20 క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు 32 సార్లు 200కి పైగా స్కోర్ చేయగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 31 సార్లు ఈ ఘనత సాధించింది.
టీ20 క్రికెట్‌లో అత్యధిక 200+ పరుగులు చేసిన జట్లు
35 - చెన్నై సూపర్ కింగ్స్
34 - సోమర్‌సెట్
32 - భారత్
31 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
29 - యార్క్‌షైర్
28 - సర్రే
CSK VS SRH HIGHLIGHTS: చెన్నైతుషార్ దేశ్‌పాండే దెబ్బకు తుస్సుమన్న హైదరాబాద్..