మానికా బత్రాపై చర్యలు తీసుకునున్న టీటీ ఫెడరేషన్... కోచ్ సాయం వద్దన్నందుకు...

First Published | Jul 27, 2021, 3:35 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా... మూడో రౌండ్‌లో ఓడిన విషయం తెలిసిందే. టీటీలో పోటీపడిన మిగిలిన ప్లేయర్లు టైమ్ అవుట్‌లో కోచ్‌ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటుంటే... మానికా బత్రా మాత్రం ఒంటరిగా పోరాడింది...

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి బరిలో దిగింది మానికా బత్రా. అయితే భారీ అంచనాలున్న ఈ జోడీ, తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశగా వెనుదిరిగింది...
undefined
మనికా బత్రా, తన మిక్స్‌డ్ డబుల్ ఆటగాడైన శరత్ కమల్ శిక్షణలోనే రాటుతేలింది. శరత్ కమల్ కోచింగ్‌లోనే ఈ జోడి ఆసియా క్రీడల్లో అదరగొట్టాడు. మిక్స్‌డ్ డబుల్స్‌తో పాటు మహిళల సింగిల్స్‌లోనూ పతకాలు సాధించారు.
undefined

Latest Videos


అయితే నేషనల్ గేమ్స్‌లో మానికా బత్రాను ఓడించిన సుత్రీతా ముఖర్జీ, సౌమ్యదీప్ శిక్షణలో ఆడుతోంది. సౌమ్యదీప్ రాయ్, ప్రస్తుతం జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్‌గా ఉన్నారు...
undefined
అయితే ఒలింపిక్స్‌లో కోచ్ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడని మానికా బత్రా... నేషనల్ కోచ్ సౌమ్యదీప్‌ను సుత్రీతా కోచ్‌గా పేర్కొంది. ఈ కామెంట్లపై టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీరియస్‌ అయ్యింది...
undefined
‘మానికా బత్రా కోచ్ సలహాలు తీసుకోకూడదనుకోవడంలో తప్పులేదు. అయితే సౌమ్యదీప్‌ను పర్సనల్ కోచ్‌గా పేర్కొనడం మాత్రం చాలా తప్పు. సుత్రీత, సౌమ్యదీప్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. కానీ అతను నేషనల్ కోచ్...
undefined
మానికా బత్రా పర్సనల్ కోచ్‌ కోసం అప్లై చేసింది. మేం కూడా రికమెండ్ చేశాం. అయితే టోక్యోలో ఉన్న నిబంధనల కారణంగా ఒకే కోచ్‌ను అనుమతించారు... కోచ్ కోసం చేసుకున్న అప్పీలు, ఆఖరి నిమిషంలో రద్దు కావడంతో మానికా బత్రా ఫీల్ అయ్యింది.
undefined
ఇప్పటికే సౌమ్యదీప్‌ను ఈ విషయంపై మేనేజర్ ఎంపీ సింగ్‌తో మాట్లాడి, ఫిర్యాదు చేయాల్సిందిగా కోరాం. మేం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం...’ అంటూ తెలిపాడు భారత టీటీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ బెనర్జీ...
undefined
click me!