విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’:కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...ఒడ్డున పడ్డట్టేనా?

First Published | Nov 26, 2024, 6:30 AM IST

విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ లు బాగున్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ బలహీనంగా ఉండటం మరియు ప్రమోషన్స్ సరిగా లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Vishwak Sen, Mechanic Rocky, business


 విశ్వక్ సేన్  (Vishwak Sen) లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ'(Mechanic Rocky) నవంబర్ 22న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)..లు హీరోయిన్లుగా నటించారు. 

రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ  చిత్రానికి తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్..లు బాగున్నాయని అంతా మెచ్చుకున్నారు. అయితే అనుకున్న స్దాయిలో సినిమా నిలబడలేదు.


మిక్సెడ్  రివ్యూలు వచ్చినా రేసీగా సెకండాఫ్ నడుస్తుందనే టాక్ కలిసి వస్తుందనుకున్నారు. అలాగే కామెడీ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనుకున్నారు. అయితే వీక్ ప్రమోషన్స్, ఫస్టాఫ్ అసలు బాగోకపోవటంతో భాక్సాఫీస్ దగ్గర విశ్వక్సేన్ సినిమా పెద్దగా ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది.

సినిమా ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ విశ్వక్ సేన్ ప్రీవియస్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు కలెక్షన్స్ కన్నా కూడా తక్కువే వచ్చాయి.   ఓవరాల్ గా డీసెంట్ టాక్ తో కూడా సినిమా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసింది.



మెకానిక్ రాకీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే10  కోట్లకు పైగా షేర్ తెచ్చుకోవాలి. సినిమా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.8 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవటం చూస్తూంటే అది జరిగే పనిలా లేదు.

విశ్వక్సేన్ గత చిత్రాలు ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’వర్కవుట్ కాకపోయినా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నాయి..మంచి ప్రయత్నం అని మెచ్చుకున్నారు. ఇప్పుడు విశ్వక్సేన్ ఉన్న సిట్యువేషన్ లో యావరేజ్ గ్రాసర్స్ వల్ల ఉపయోగం లేదు. భాక్సాఫీస్ ఫెయిల్యూర్ వస్తే కెరీర్ వెనక్కి వస్తుంది. ఫుల్ లెంగ్త్ బ్లాక్ బస్టర్స్ వస్తేనే నెక్ట్స్ సినిమాలు నిలబడతాయి. 

సెకండ్ హాఫ్ ని ఇంకా ఆస్తకిగా మార్చి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బెటర్ కానీ.. సినిమాని నిలబెట్టే స్థాయిలో లేదు. కొన్ని సీన్లు సెకండ్ హాఫ్ లో కూడా బోరింగ్ గా ఉంటాయి. విశ్వక్ సేన్ తన సూట్ అయ్యే పాత్రలో నటించాడు. విశ్వక్ సేన్ గత చిత్రాల్లో లాగే అతడి యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ డైమింగ్ ఉంటాయి. 


  మెకానిక్ రాకీ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో  మొత్తం మీద 7.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.అలాగే మరోవైపు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ మార్కెట్ అంతా కలిపితే.. రూ. 1.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 10 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం  ఉంది.


ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. ఈ వారం విడుదలైన చిత్రాల్లో  చెప్పుకోదగ్గ  చిత్రం ఇదే . వాణిజ్య హంగుల మోతాదు కారణంగా ఇది కమర్షియల్ సినిమా అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ తో  కూడిన కథ. 


ఫక్తు థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరకున్న కథ మెకానిక్ రాకీ. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉందని ఇప్పటిదాకా వచ్చిన టాక్.  చాలావరకు సీరియస్ అంశాలున్న ఈ సినిమాకి వాణిజ్య హంగులు జోడించటం కాస్త మైనస్ గా మారిందంటున్నారు.

వాటి కారణంగా కథలో డెప్త్ కొరవడింది. కామెడీ సన్నివేశాలు, పాటల మధ్య ఫస్టాఫ్ లో కథే ముందుకు కదలదు. పాత్రలు నడుచుకునే విధానం మొదలుకుని కథలో చోటు చేసుకునే పరిణామాల వరకూ ఏవీ సహజంగా అనిపించవు. దాంతో ప్రేక్షకుడు కథలో లీనం కాలేకపోయారు అని చెప్తున్నారు. కామెడీ కూడా పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు.  సెకండాఫ్  ఈ సినిమాకి ప్రధానబలం.  

కొన్ని సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత శ్రద్దా శ్రీనాథ్, విశ్వక్ సేన్ ఎంట్రీ ఇస్తారు. కొన్ని కామెడీ సన్నివేశాలతో చిత్రం అలా ముందుకు వెళుతూ ఉంటుంది. కామెడీ సీన్స్ అక్కడక్కడా నవ్విస్తాయి కానీ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ చూపించవు. ఫస్ట్ హాఫ్ లో మీనాక్షి చౌదరితో డ్యూయెట్ సాంగ్స్, ఫైట్స్ గట్రా ఉంటాయి. అయితే ఇంటర్వెల్ వరకు ఆశించిన స్థాయిలో చిత్రం ఆసక్తిగా ఉండదు. 

ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ కామెడీ, సరైన కథ లేకపోవడం, ఇంటర్వెల్ వరకు ఆసక్తి కలిగించకపోవడం మైనస్ గా మారాయి. కమర్షియల్ ఫార్మాట్ లో ట్రై చేసినప్పుడు అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ప్యాకేజ్ లాగా కుదరాలి. మెకానిక్ రాకీ చిత్రంలో అది జరగలేదు. 

Latest Videos

click me!