సికింద్రాబాద్‌లో ‘మిల్కా సింగ్’ కాలనీ... ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ పతకాల వేట...

First Published Jun 19, 2021, 4:33 PM IST

భారత మాజీ అథ్లెట్, లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్, 91 ఏళ్ల వయసులో కరోనాతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాను కరోనాను జయించి, తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆయన, భార్య నిర్మలా కౌర్ మరణంతో మానసికంగా కృంగిపోయి, తుదిశ్వాస విడిచారు.

‘ఫ్లైయింగ్ సిఖ్’గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కా సింగ్‌ పేరుతో భాగ్యనగరంలోని సికింద్రాబాద్ ఏరియాలో ఓ కాలనీ కూడా ఉంది...
undefined
1929, నవంబర్ 20న జన్మించిన మిల్కా సింగ్, భారత్- పాక్ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత శరణార్థ శిబిరంలో గడిపిన మిల్కా సింగ్, స్వాతంత్య్రానంతరం ఢిల్లీకి చేరుకున్నాడు...
undefined
టికెట్ లేకుండా రైళ్లో ప్రయాణించి దొరికిపోయిన మిల్కా సింగ్, ఆ నేరానికి కొన్నిళ్లు తీహార్ జైలులో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత భారత ఆర్మీలో చేరాలని కలలు కన్న మిల్కా సింగ్, నాలుగో ప్రయత్నంలో టెక్నికల్ జవాన్‌గా సెలక్ట్ అయ్యారు...
undefined
ఆర్మీ నుంచే పరుగు పందేంలో పాల్గొనడం మొదలెట్టిన మిల్కా సింగ్, 1951లో సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉద్యోగం చేసేవారు. 1960 వరకూ సికింద్రాబాద్‌లోనే నివసించిన మిల్కా సింగ్, బొల్లారంలోని అమ్ముగూడ ఏరియాలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు...
undefined
బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే పహారి గోడ ఉన్న అమ్ముగూడలో రాళ్లు నింపిన బ్యాగును భుజాన వేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు మిల్కా సింగ్...
undefined
1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో ఫైనల్ చేరిన మిల్కా సింగ్... ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో మిల్లీ సెకన్ తేడాతో పతకాన్ని కోల్పోయారు. ఆ పరాజయం మిల్కా సింగ్‌లో మరింత కసిని పెంచింది..
undefined
1958 నేషనల్ గేమ్స్‌లో 200 మీటర్లు, 400 మీటర్ల పోటీలో రికార్డు క్రియేట్ చేసిన మిల్కా సింగ్, 1958 కామ్వనెల్త్ గేమ్స్‌లో 400 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని సాధించారు..
undefined
మిల్కా సింగ్ విజయాలకి గుర్తుగా ఆయన నివసించిన సికింద్రాబాల్‌లోని ఈఎంఈ సెంటర్‌కి ‘మిల్కా సింగ్ కాలనీ’గా నామకరణం చేసింది భారత ఆర్మీ..
undefined
click me!