T20 World Cup: విరాట్, రోహిత్ కాదు.. అతడి ఆటంటేనే నాకు చాలా ఇష్టం.. కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Oct 21, 2021, 3:57 PM IST

Kapil Dev: భారత బ్యాట్స్మెన్ లలో తనకు ఎవరంటే ఇష్టమో దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్  చెప్పేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాటర్లుగా  కొనసాగుతున్న  భారత  సారథి విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు  ఆ జాబితాలో లేరు. 

భారత్ కు  మొదటి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ (Kapil dev) తన మనసులోని మాటను చెప్పేశాడు. భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ పై ఆయన ప్రశంసలు కురపించాడు. రాహుల్ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తి అని అన్నాడు. 

తనను కలిసిన ఒక వెబ్ సైట్ తో కపిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత (India) జట్టులో ఎవరి ఆటను చూడటమంటే మీకు ఇష్టమనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. అయితే అక్కడున్నవాల్లంతా కపిల్ దేవ్.. భారత సారథి విరాట్ కోహ్లి  (Virat kohli)పేరైనా లేదంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేరుగానీ చెప్తారని అనుకున్నారు. 

केएल राहुल

కానీ  ఈ హర్యానా హరికేన్ మాత్రం కెఎల్ రాహుల్ (KL Rahul) పేరు చెప్పేశాడు. కపిల్ మాట్లాడుతూ.. ‘కెఎల్ రాహుల్..! నేను అతడి ఆటను ఆస్వాదిస్తాను. రాహుల్ చాలా కాన్ఫిడెంట్ తో షాట్లు ఆడతాడు. రాహుల్ కొట్టే షాట్లపై అతడికి నమ్మకం ఉంటుంది. 

ఇటీవల ముగిసిన ఐపీఎల్ (IPL) లో అతడు ఎంతో గొప్పగా రాణించాడు. టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో కూడా అదే స్థాయిలో ఆడతాడని అనుకుంటున్నాను. భవిష్యత్తులో అతడు భారత జట్టుకు మరిన్ని సేవలు అందిస్తాడు. 

రాహుల్ భారత్ కు దొరికిన గొప్ప ఆస్తిగా నేను భావిస్తున్నాను’ అని కపిల్ అన్నాడు. రాబోయే ప్రపంచకప్ లో భారత్ కచ్చితంగా మొదటి నాలుగు స్తానాల్లో నిలుస్తుందని కపిల్ అభిప్రాయపడ్డాడు. 

ఇక భారత జట్టుకు మెంటార్ గా ఎంపికైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) పైనా కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. ధోని.. తన అనుభవంతో భారత జట్టును విజయపథంలో నడిపిస్తాడని అన్నాడు. 

ధోని చాలా ప్రశాంతమైన ఆటగాడు అని, అతడు మెంటార్ గా వ్యవహరిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశమని కపిల్ అన్నాడు. చాలా రోజుల తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారని తెలిపాడు. ధోని.. తన అనుభవం, ఆలోచనలతో టీమిండియాను ప్రభావితం చేయగల సమర్థుడని కొనియాడాడు. 

కాగా.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన కెఎల్ రాహుల్.. వార్మప్ మ్యాచ్ లలో కూడా అదరగొట్టాడు. తొలి వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై హాఫ్ సెంచరీతో మెరిసిన రాహుల్.. ఆస్ట్రేలియా పై కూడా 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

click me!