వార్నర్ భయ్యా నువ్వు సూపర్... ఆస్ట్రేలియాను ఓడించిన భారత జట్టుకి...

First Published Aug 2, 2021, 11:12 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత వుమెన్స్ హాకీ జట్టు అద్భుతం చేసింది. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతున్న మహిళా జట్టు, మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడించి సెమీస్‌కి దూసుకెళ్లింది...

1980 తర్వాత 36 ఏళ్ల పాటు ఒలింపిక్స్‌కి అర్హత కూడా సాధించలేకపోయిన భారత మహిళా హాకీ జట్టు, 2016 రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించినా... ఒకే ఒక్క డ్రాతో పాయింట్ల పట్టికలో 12వ స్థానంలో నిలిచింది...

2020లో వరుసగా మూడు ఓటముల తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా, వరుసగా రెండు విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది...

గ్రూప్ స్టేజ్‌లో వరుసగా ఐదుకి ఐదు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ కావడంతో టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారంతా. క్వార్టర్స్ దాకా చేరుకోవడమే పెద్ద అఛీవ్‌మెంట్ అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రూప్ టాపర్ ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చింది భారత జట్టు. 1-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి, మొట్టమొదటిసారిగా సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది...

1980లో నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ, అప్పుడు సెమీ ఫైనల్స్ నిర్వహించలేదు. ఆస్ట్రేలియాను ఓడించి, సెమీస్ చేరిన భారత జట్టుకి ఆసీస్ జనాల నుంచి శుభాకాంక్షలు అందుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ డేవిడ్ వార్నర్...భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘మన అమ్మాయిలు అదరగొట్టారు, వారి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇండియాకి శుభాకాంక్షలు, గుడ్ లక్’ అంటూ సెమీస్ చేరిన భారత జట్టుని అభినందిస్తూ ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ట్వీట్‌ని రీట్వీట్ చేశాడు వార్నర్...

ఐపీఎల్ పోస్టుల ద్వారా ఇండియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆసీస్ వుమెన్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ రిపోర్టర్ చోలే అమాండా బెయిలీ కూడా భారత జట్టుకి అభినందనలు తెలిపింది...
undefined
‘ఒలింపిక్స్‌లో అదిరిపోయే ఆరంభం ఇచ్చిన తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో ఇండియాపై ఓడిపోయారు. అయితే ఈరోజు ఇండియా అద్భుతంగా ఆడింది. తల ఎత్తుకోండి ఆసీస్ గర్ల్స్, మీరు మేం గర్వించేలా ఆడారు. ఇండియాకి శుభాకాంక్షలు, బ్రిలియెంట్‌ గర్ల్స్. స్వర్ణం గెలవండి...’ అంటూ ట్వీట్ చేసింది చోలే అమాండా బెయిలీ.

Chloe-Amanda Bailey

click me!