అనురాగ్ మా పోరాటాన్ని అణచివేయాలని చూశారు : కేంద్ర క్రీడామంత్రిపై వినేశ్ పోగట్ షాకింగ్ కామెంట్స్

First Published | May 3, 2023, 12:49 PM IST

Wrestlers Protest: కేంద్ర క్రీడా శాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్ పై ప్రముఖ రెజ్లర్ వినేశ్ పోగట్ సంచలన ఆరోపణలు చేసింది. 

Image credit: PTI

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేదాకా తమ పోరాటాన్ని విరమించబోమని భీష్మించుకు కూర్చున్న  రెజ్లర్లు  అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.   ఇన్నాళ్లు బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల మీదే  ఫోకస్ చేసిన రెజ్లర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని  కూడా సీన్ లోని తీసుకొచ్చారు. 

Image credit: PTI

రెజ్లర్ల పోరాటాన్ని  ముందుండి  నడిపిస్తున్న ప్రముఖ రెజ్లర్ వినేశ్ పోగట్ తాజాగా  కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఠాకూర్  తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె   మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

Latest Videos


Image credit: PTI

వినేశ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ ధర్నా ఎవరికి చెప్పి స్టార్ట్ చేశారని కొంతమంది పెద్దలు అడుగుతున్నారు.    జనవరిలో మేం జంతర్ మంతర్ కు చేరుకోకముందే డబ్ల్యూఎఫ్ఐ ప్రతినిధులకు  పూర్తి వివరాలు అందించాకే  నిరసనకు దిగాం. అప్పుడు మాకు  బ్రిజ్ భూషణ్ పై  చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్లు ఇప్పటివరకూ స్పందించలేదు.  

Image credit: PTI

మొదటిసారి మేం ధర్నా చేసినప్పుడు   కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాకు  న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చారు.  దాదాపు  అక్కడ బ్రిజ్‌ భూషణ్ వల్ల  సమస్యలు ఎదుర్కున్న వారందరూ ఆయనకు వారి బాధలు చెప్పుకున్నారు.   కానీ కమిటీ పేరుతో ఆయన మా పోరాటాన్ని అణచివేయాలని చూశారు.  ఆరోపణలు ఎదుర్కుంటున్నవారిపై  ఏ విధమైన  చర్యలూ తీసుకోలేదు..’అని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇదిలాఉండగా బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసేదాకా తాము పోరాటాన్ని విరమించబోమని,  అప్పటిదాకా బరిలోకి దిగబోమని  రెజ్లర్లు హెచ్చరించారు.   జూన్ 1 నుంచి  కిర్గిస్తాన్ లో జరుగబోయే  ర్యాంకింగ్ సిరీస్ కూడా వెళ్లబోమని స్పష్టం చేశారు.  జూన్ 1 నుంచి  4 వరకు  కిర్గిస్తాన్ లో  ర్యాకింగ్ సిరీస్ టోర్నీ  జరుగనుంది.   

కాగా  రెజ్లర్ల ఆరోపణలపై  బ్రిజ్ భూషణ్ కూడా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హర్యానాలో 90 శాతం మంది రెజ్లర్ల కుటుంబాలు తనకు మద్దతుగా ఉన్నాయని, ఒక్క కుటుంబం (వినేశ్ పోగట్ ను ఉద్దేశిస్తూ)  మాత్రమే తనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్  లో ధర్నా  చేస్తుందని అన్నాడు.  లైంగిక ఆరోపణలపై సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు   ఢిల్లీ పోలీసులు   బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా  ఇంతవరకూ అతడిని విచారణకు పిలువలేకపోవడంతో రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

click me!