ఈ నగరం సోలాపూర్ (Solapur) నుండి ఔరంగాబాద్ (Aurangabad) వెళ్లే రహదారిపై ఉంది. ఈ ప్రాంతాన్ని చించాపూర్ అని కూడా పిలిచేవారు. ఈ ప్రాంతంలో చింత చెట్లు ఎక్కువగా ఉండటంతో చించాపూర్ అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది.
తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రతియేటా యాత్రికులు (Pilgrims) పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం ఉండటంతో ఈ ప్రదేశం పేరును చించాపూర్ (Chinchapur) నుండి తుల్జాపూర్ గా మార్చారు.
తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం, ఘట శిలా దేవాలయం, విష్ణు తీర్థం, కల్లోల తీర్థం, పాపనాశి తీర్థాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి. తుల్జాపూర్ కి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.
తుల్జా భవాని దేవాలయం: భారత దేశంలోని 51 శక్తి పీఠాలలో చిన్న గ్రామమైన తుల్జాపూర్ లో తుల్జా భవాని దేవాలయం (Tulja Bhavani Temple) ఉంది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గాదేవి తుల్జా భవాని అవతారంలో దర్శనమిస్తుంది. ఒక మీటరు కంటే ఎక్కువ పొడవు ఉన్న ఈ ప్రతిమను గ్రానైట్ తో చెక్కారు. మహిషాసురుడిని సంహరించడానికి దేవత ఇక్కడ వెలిసిందని భక్తుల నమ్మకం (Believe).
విష్ణు తీర్థం: తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా విష్ణు తీర్థం (Vishnu Theertham) ఉంది. తుల్జా భవాని దేవాలయానికి ఈశాన్య దిక్కున (Northeast) మూడు ద్వారముల విష్ణు తీర్థము ఇది. గంగా, యమునా, సరస్వతి కలిసే ప్రదేశంగా నమ్మే ఈ ప్రాంతం కల్లోల తీర్థం వంటిది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన అన్ని పాపాలు తొలగిపోయి పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
కల్లోల తీర్థము: బ్రహ్మదేవుని కోరిక మేరకు గంగ, యమున, సరస్వతి నదుల జలాలు వచ్చి ఈ చెరువులో కలిసాయని అని పురాణకథనం. ఈ మూడు నదీజలాలు వచ్చి కలిసినప్పుడు తీవ్రమైన ప్రతిధ్వని ఏర్పడిందని అందుకే ఈ చెరువుకు కల్లోల తీర్థముగా (Kallola Theertham) పేరు వచ్చిందని కథనం. ఈ చెరువు చుట్టూ అన్నివైపులా గోడలు కలిగి ఉంది. ఈ చెరువులో స్నానమాచరించిన పాపాలు (Sins) తొలగిపోయి పునీతులవుతారు అని భక్తుల నమ్మకం.
పాపనాశి తీర్థం: ప్రసిద్ధి చెందిన ప్రధాన చెరువులలో పాపనాశి తీర్థం (Papanashi Theertham) ఒకటి. పాప నాశి అనగా పాపాలను నాశనం (Destruction) చేసే జలం అని అర్థం. ఈ తీర్థం రాతితో కప్పబడి నిర్మించబడినది. ఈ చెరువులో స్నానమాచరించిన సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.