Recruitment in TGSRTC : నెలకు రూ.30 వేలు, సొంత డిపోలోనే పోస్టింగ్ : ఆర్టిసిలో భారీగా ఉద్యోగాలు

First Published | Nov 27, 2024, 10:47 AM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్తలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఆ సంస్థ భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ఉద్యోగాలకు కావాల్సిన అర్హత, సాలరీ గురించి ఇక్కడ తెలుసుకొండి. 

TGSRTC

Recruitment in TGSRTC : ప్రభుత్వ రంగానికి చెందిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్ధ (టిజిఎస్ ఆర్టిసి)లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. 1201 డ్రైవర్ పోస్టుల భర్తీకి సిద్దమైన ఆర్టిసి అర్హుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ డ్రైవర్ నియామకాలను చేపడుతోంది టీజిఎస్ ఆర్టిసి. 

TGSRTC

టిజిఎస్ ఆర్టిసి డ్రైవర్ పోస్టులకు అర్హతలు : 

తెలంగాణ ఆర్టిసి చేపడుతున్న డ్రైవర్ పోస్టుల భర్తీకి అందరూ అర్హులు కారు. కేవలం మాజీ సైనికులకు మాత్రమే ఈ ఉద్యోగాలను పొందే అవకాశం వుంటుంది. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ ఆర్టిసితో కలిసి ఈ రిక్రూట్ మెంట్ చేపడుతోంది. మాజీ సైనికులకు కూడా  మరికొన్ని అర్హతలు వుంటేనే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

మాజీ సైనికుల వయసు 58 సంవత్సరాలకు మించి వుండకూడదు. 

హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వుండాలి. అలాగే 18 నెలల డ్రైవింగ్ అనుభవం వుండాలి. 

ఎత్తు కనీసం 160 సెంటిమీటర్లు వుండాలి.   
 


TGSRTC

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

ఈ నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు కలిగిన మాజీ సైనికులు నవంబర్ 30 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల మాజీ సైనికులు తమ అప్లికేషన్ ను porsb-ts@nic.in లేదా emprsb-ts@nic.in కు మెయిల్ చేయాలని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తెలిపారు. అభ్యర్థులు తమ డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి పిడిఎఫ్ రూపంలో మెయిల్ చేయాల్సి వుంటుంది. 

ఇలా మాజీ సైనికుల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలు కలిగినవారికి ఆర్టిసి డ్రైవర్లుగా నియమిస్తారు. ఇలా ఉద్యోగం పొందిన మాజీ సైనికులకు కోరుకున్న ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించారు. అంటే తమ స్వస్థలంలో కుటుంబంతో కలిసివుంటే హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చన్నమాట. 
 

TGSRTC

సాలరీ ఎంత? 

మాజీ సైనికులు కాంట్రాక్ట్ పద్దతిలో టిజిఎస్ ఆర్టిసిలో చేరితే వారికి ప్రతినెలా జీతంతో పాటు  అలవెన్సులు కూడా లభిస్తాయి. ఇలా నెలకు 26 సాలరీతో పాటు రోజుకు 150 రూపాయల చొప్పున అలవెన్స్ లభిస్తుంది. అంటే మొత్తంగా స్వస్థలంలో పనిచేస్తూనే రూ.30 వేల వరకు సంపాదించవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని మాజీ సైనికులు ఉపయోగించుకోవాలి. 

TGSRTC

రూ.50 జీతంతో టిజిఎస్ ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీ : 

ఇటీవల తెలంగాణ ఆర్టిసి భారీ సాలరీలతో ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్ తార్నాకలో ఆర్టిసి హాస్పిటల్ తో పాటు నర్సింగ్ కాలేజీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే... అయితే నర్సింగ్ కాలేజీలో బోధనా సిబ్బంది నియామకాలను చేపట్టారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసి కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేసింది. 

కేవలం ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలను ఎంపికచేసింది. ఇలా ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికయినవారు రూ.50వేల జీతం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.28 వేలు, ట్యూటర్ కు రూ.25 వేల జీతం అందుకుంటున్నారు. 

Latest Videos

click me!