ఈ చిన్న చిన్న ఆకులు తింటే మీకు ఎలాంటి జబ్బులు రావు
Image credits: Getty
తులసి ఆకులు
తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే వ్యాధులకు దూరంగా ఉంటాం.
Image credits: Getty
మునగాకు
మునగాకు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలుంటాయి. ఈ ఆకులను రోజూ తిన్నా మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు.
Image credits: Getty
వేపాకులు
వేపాలకులను ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలుఉంటాయి. ఇవి కూడా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి.
Image credits: Getty
కరివేపాకు
కరివేపాకును రెగ్యులర్ గా తింటున్నా.. వీటి వల్ల కలిగే ఉపయోగాలు మాత్రం చాలా మందికి తెలియవు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకును తిన్నా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Image credits: Getty
తోటకూర
మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరను తిన్నా ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం.