భోగి మంటలలో ప్లాస్టిక్ వస్తువులను, ఇతర హానికర వాయువులను విడుదల చేసే వస్తువులను వేయరాదు. నిజానికి భోగి మంటలలో కాల్చాల్సింది మనలోని చెడు అలవాట్లు (Bad habits), చెడు ఆలోచనలు. ఇలా మనస్సును శుద్ధి చేసుకొని మానసిక ఆరోగ్యం, విజయాలను (Achievements) కలిగించమని ఆ అగ్ని దేవుణ్ణి కోరుకోవాలి.