పరిశుభ్రత రోజువారీ జీవితంలో.. ముఖ్యంగా మీ లైంగిక జీవితంలో ఒక భాగం కావలంటారు నిపుణులు. ముఖ్యంగా యోని, పురుషాంగం పరిశుభ్రతను గురించి తరచుగా ఆరోగ్య నిపుణులు నొక్కి చెప్తుంటారు. సురక్షితమైన లైంగిక కార్యకలాపాల సాధనకు చేతుల పరిశుభ్రత కూడా ఒక ముఖ్యమైన అంశమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫోర్ ప్లే, లైంగిక సంపర్కంలో చేతులను ఉపయోగిస్తుంటారు. ఇది లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది. కానీ మురికి చేతులతో ఫోర్ ప్లేలో పాల్గొంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తది. శృంగారానికి ముందు చేతులు కడుక్కోవడం చాలా రొమాంటిక్ విషయం కాకపోవచ్చు. అసలు కలయికకు ముందు ఎందుకు చేతులను కడుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పరిశుభ్రత
మురికిగా ఉన్న చేతులకు ఎన్నో రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవి మిమ్మల్ని అంటువ్యాధుల బారిన పడేస్తాయి. అందుకే కలయికకు ముందు స్త్రీపురుషులిద్దరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
sex life
యూటీఐల నివారణ
మురికి చేతుల వల్ల మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా వెళుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే రొమాన్స్ కు ముందు ఖచ్చితంగా చేతులను కడుక్కోవాలి.
చికాకును తగ్గిస్తుంది
కొన్నిసార్లు మీరు ఉపయోగించే బాడీ లోషన్లు లేదా ఇతర సౌందర్య సాధనాల నుంచి వచ్చే సువాసనలు లేదా రసాయనాలు వంటి అవశేష పదార్థాలు చేతిలో మిగిలిపోతాయి. అవి ప్రైవేట్ భాగాలకు చికాకును కలిగిస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో మీరు తేలికపాటి సబ్బుతో చేతులను కడుక్కోవాలి.
Marrige sex
అలెర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తుంది
చేతులకు అంటుకున్న కొన్ని పదార్థాల్లో అలెర్జీ కారకాలు ఉండొచ్చు. దీనివల్ల కొంతమందికి ఎరుపు లేదా మంట కలుగుతుంది. ఇది ప్రాథమికంగా యోని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది
మంచి పరిశుభ్రత శృంగార భాగస్వాములలో పరిశుభ్రత, సౌకర్యాన్ని పెంపొందిస్తుంది. ఇది మొత్తం మీ సన్నిహిత అనుభవాన్ని పెంచుతుంది. అందుకే చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్తారు.
దుర్వాసనను నివారిస్తుంది
చేతులను కడుక్కోవడం వల్ల అసహ్యకరమైన వాసనలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇది మీరు మరింత సేపు లైంగకి కార్యకలాపాలను ఆస్వాదించడానికి సహాయపడుతుంది.
శ్రేయస్సు
చేతుల పరిశుభ్రతను పాటించడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది సన్నిహిత కార్యకలాపాల కోసం శుభ్రమైన, సురక్షితమైన వాతావరణానికి మద్దతునిస్తుందని నిపుణులు అంటున్నారు.