Low Sexual Desire
నిజం చెప్పాలంటే ఆడవారికి లైంగిక కోరిక సంవత్సరాలు గడిచేకొద్దీ మారిపోతూ ఉంటాయి. అంటే యోని పొడిబారం, తక్కువ లిబిడో వంటి వివిధ కారణాల వల్ల ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. ఇవే కాకుండా ఇతర కారణాల వల్ల ఆడవారికి సెక్స్ పట్ల కోరికలు రావు. అవేంటో తెలుసుకుందాం పదండి.
శారీరక సమస్యలు
శస్త్రచికిత్స వల్ల కూడా ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ముఖ్యంగా జననేంద్రియ మార్గం లేదా రొమ్ము చికిత్స వల్ల ఆడవారి లైంగిక జీవితం ప్రభావితం అవుతుంది. అలాగే హై బీపీ వల్ల కూడా ఆడవారికి సెక్స్ కోరికలు తగ్గుతాయి. ఎందుకంటే దీనివల్ల జననేంద్రియ భాగాలకు రక్తప్రవాహం సరిగ్గా చేరదు. దీంతో వీరు ఉద్వేగం పొందడం కష్టమవుతుంది. అలాగే యోని పొడిబారడం వల్ల కూడా వీరికి దీనిపై మూడ్ ఉండదు. అలాగే డయాబెటీస్ కూడా సెక్స్ కోరికలను తగ్గిస్తుంది. ఎలా అంటే డయాబెటిస్ రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. దీంతో ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు.
Less Interest in Sex
హార్మోన్ల మార్పులు
రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పడిపోతాయి. దీనివల్ల ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం వల్ల యోని కణజాలాలు పొడిగా అవుతాయి. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొన్నా నొప్పి వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆడవారు ఈ సమయంలో లైంగికంగా చురుగ్గా ఉండరు.
మానసిక కారణాలు
మానసిక ఆరోగ్యం కూడా లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. అంటే అతిగా ఆలోచించడం, చిత్తవైకల్యం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ప్రతికూల లైంగిక అనుభవాలు, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు.
సంబంధాల సమస్యలు
లైంగిక సాన్నిహిత్యం లేకపోవడానికి దారితీసే అతిపెద్ద కారణాలలో రిలేషన్షిప్ సమస్యలు ఒకటి. అంటే భర్తతో బంధం సరిగ్గా లేకపోతే కూడా ఆడవారికి సెక్స్ కోరికలు రావు. అంటే భాగస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించడం, మానసికంగా దగ్గరక కాకపోవడం, రోజూ గొడవలు, కమ్యూనికేషన్ గ్యాప్ వంటి సమస్యల వల్ల ఆడవారికి దానిపై ఇంట్రెస్ట్ ఉండదు.