కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలోనూ మనం తాగడం వల్ల ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందుతాయి. అంతేకాదు…రెగ్యులర్ గా కొబ్బరి నీరు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ సీజన్ లో అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టే సమస్య ఉంది. అవి రాకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అంతేకాదు కొబ్బరి నీళ్లు రెగ్యులర్ గా తాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సీజన్ లో తొందరగా తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. అందుకే.. ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.