వేడి వేడిగా టీ, కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 28, 2024, 3:01 PM IST

మనలో ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే వేడి వేడి ఒక కప్పు టీ లేదా కాఫీని తాగుతుంటారు. దీనివల్ల నిద్రమబ్బు వదిలి శరీరం రీఫ్రెష్ అవుతుంది. కానీ ఇలా వేడివేడిగా తాగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? 

వేడి వేడిగా టీ లేదా కాఫీని చలికాలంలో తాగితే వచ్చే ఆ మజానే వేరు. అందుకే ఉదయం లేవగానే కప్పు వేడి వేడి కాఫీ లేదా టీని తాగుతుంటారు. కొంతమంది అయితే రోజుకు మూడు నాలుగు పూటల కూడా టీ, కాఫీలను తాగుతుంటారు. అది కూడా వేడి వేడిగా. కానీ వేడి పానీయాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేడి వేడిగా టీ, కాఫీని తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

hot black tea

వేడి టీ , క్యాన్సర్ మధ్య సంబంధం 

ఒక అధ్యయనం ప్రకారం.. వేడి వేడి టీ లేదా కాఫీ తాగితే అన్నవాహిక కణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే ఇది అన్నవాహిక అడెనోకార్సినోమా కు ఎక్కువ సంబంధం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇఎస్సిసి అన్నవాహికలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయొచ్చు. సాధారణంగా ఇది మధ్య మూడవ లేదా ఎగువ భాగాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ వేడిగా కాకుండా.. కొంచెం తక్కువ వేడి చేసుకుని టీ, కాఫీలు తాగడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. 
 

Latest Videos


hot tea

వేడి పానీయాలను తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు 

అన్నవాహిక నష్టం

వేడి వేడి టీ, కాఫీలను రెగ్యులర్ గా తాగడం వల్ల (65 °C లేదా 149 °F కంటే ఎక్కువ) అన్నవాహికకు గాయం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో పదే పదే అన్నవాహికకు వేడి వల్ల గాయం కావడం వల్ల దీర్ఘకాలిక మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 


నోటి కణజాలం సున్నితత్వం

ఎక్కువ వేడిగా ఉండే పానీయాలను తాగడం వల్ల గొంతు, నోరు, కడుపు పొరకు చిరాకు కలుగుతుంది. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలున్న వారికి ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సమస్యలు మరింత పెద్దవిగా అవుతాయి. 
 

ఉష్ణోగ్రత, జీర్ణక్రియ

ఆడవారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్లు వేడి వేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు ఎక్కువ సున్నితంగా ఉండే గర్బిణులు వేడిగా అస్సలే తాగకూదు. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉండే డ్రింక్స్ గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్,కడుపు అసౌకర్యం వంటి సమస్యలను కలిగిస్తాయి. 
 

మీరు టీ , కాఫీల వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని సరైన ఉష్ణోగ్రత వద్దే తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ టీ, కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగని కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. లిమిట్ లో కెఫిన్ ను తీసుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. 

click me!