సెక్స్ కోరికలు, సామర్థ్యం తగ్గాయా? పుచ్చకాయను ఇలా తింటే ఆ సెక్స్ సమస్యలే ఉండవు

First Published | Apr 29, 2023, 11:46 AM IST

పుచ్చకాయ సెక్స్ సమస్యలను తగ్గించే గుణాలను కూడా కలిగి ఉంటుంది. అవును పుచ్చకాయను తింటే సెక్స్ కోరికలు పెరుగుతాయి. అలాగే శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.  
 

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పుచ్చకాయ గుజ్జే కాదు పుచ్చకాయ విత్తనాలు కూడా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కానీ పుచ్చకాయ బయటి పొర అంటే పుచ్చకాయ తొక్కలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? పుచ్చకాయ తొక్కలో చర్మ సమస్యలను తగ్గించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాదు పుచ్చకాయ తొక్క పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సెక్స్ సామర్థ్యం తగ్గిన పురుషులకు ఇది బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అసలు పుచ్చకాయ తొక్కను తింటే సెక్స్ పరంగా ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సెక్స్ శక్తిని పెంచుతుంది

పుచ్చకాయ తొక్క వయాగ్రా కాదు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇది పురుషుల లైంగిక కోరికలను పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు లిబిడోను  ప్రోత్సహిస్తాయి. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం పుచ్చకాయ తొక్కలను తినడం వల్ల వయాగ్రాతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలు లేకుండా అంగస్తంభన మెరుగుపడుతుందని తేలింది. మీ పుచ్చకాయ తొక్కపై నిమ్మరసం, కారం పొడి చల్లుకుని కూడా తినొచ్చు. 

Latest Videos


శక్తిని పెంచుతుంది

పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ పుష్కలంగా ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. సిట్రులైన్ రక్త నాళాల విస్తరణను పెంచుతుంది. అంతేకాదు ఇది కండరాలకు ఆక్సిజన్ సరఫరాను కూడా పెంచుతుంది. దీనిని తీసుకుంటే ఒంట్లో శక్తి పెరుగుతుంది. దీంతో శారీరక శ్రమ శక్తి పెరుగుతుంది. 
 

blood pressure

రక్తపోటు నియంత్రణ

మీకు అధిక రక్తపోటు సమస్య ఉందా? అయితే పుచ్చకాయ తొక్కను తినండి. ఎందుకంటే పుచ్చకాయ తొక్క కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పబ్ మెడ్ సెంట్రల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఊబకాయం ఉన్న పెద్దలలో పెరుగుతున్న రక్తపోటును నియంత్రించడానికి పుచ్చకాయ తొక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. సిట్రులైన్ సప్లిమెంట్స్ అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వేసవిలో పుచ్చకాయ తొక్కను తినాలనుకుంటే ఫ్రిజ్ లో కాసేపు పెట్టి తినండి. 

చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయ తొక్కలో లైకోపీన్, ఇతర ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ తొక్కలు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ ముడతలు, మచ్చలు, సన్నని గీతలు ఏర్పడతాయి. అయితే పుచ్చకాయ తొక్క ఈ సమస్యలను ఆలస్యం చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయ తొక్కలో తగినంత మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంటువ్యాధులతో పోరాడటానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పుచ్చకాయ తొక్కలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ తొక్క ఫైబర్ కు అద్భుతమైన మూలం. జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గే ప్రయాణం సులభం అవుతుంది. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. పుచ్చకాయ తొక్కను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది.
 


పుచ్చకాయ తొక్కను ఎలా తినాలి? 

పుచ్చకాయ తొక్కను కట్ చేసి సలాడ్లు, కూరగాయలు, సూప్లు తయారు చేయడానికి ఉపయోగించొచ్చు. వీటితో పాటు గ్రైండ్ చేసి చట్నీ రూపంలో తింటే కూడా మేలు జరుగుతుంది. కావాలనుకుంటే పుచ్చకాయ తొక్క రసాన్ని కూడా తాగొచ్చు. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది దీనిని ఊరగాయగా తినడానికి కూడా ఇష్టపడతారు.

click me!