ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేయాలా..? ఈ టిప్స్ అబ్బాయిల కోసమే..!

First Published | Feb 3, 2022, 12:23 PM IST

కండోమ్ వాడటం వల్ల.. కలయికను ఎక్కువ సేపు ఆస్వాదించవచ్చట.  కండోమ్ లేకపోవడం వల్ల .. సున్నితత్వం వల్ల త్వరగా భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందట.

ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేయాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా పురుషుల విషయానికి వస్తే.. ఈ విషయంలో వారికి చాలా అనుమానాలు ఉంటాయి. తొందరగా తాము భావప్రాప్తి పొందడం వల్ల.. తమ పార్ట్ నర్ తృప్తి పరచలేమేమో అనే అనుమానం ఉంటుంది. అయితే.. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలు ఎలాంటి అనుమానాలు లేకుండా.. ఎక్కువ సేపు కలయికను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి  చూసేద్దామా..

1.కండోమ్ వాడటం వల్ల ఎక్కువ సేపు సెక్స్ ని ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కండోమ్ అవాంఛిత గర్భం రాకుండా.. సెక్స్ సంబంధిత వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు మాత్రమే వాడతారని అనుకునేవారు. అయితే.. కండోమ్ వాడటం వల్ల.. కలయికను ఎక్కువ సేపు ఆస్వాదించవచ్చట.  కండోమ్ లేకపోవడం వల్ల .. సున్నితత్వం వల్ల త్వరగా భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందట. అలా కాకుండా.. కండోమ్ వాడటం వల్ల.. భావప్రాప్తి త్వరగా రాకుండా ఉంటుందట. దీంతో.. ఎక్కువ సేపు కలయికలో పాల్గొనవచ్చు.

Latest Videos


2.కండరాలు బలంగా ఉండాలి. కటి కండరాలు బలహీనంగా ఉంటే.. తొందరగా స్కలనం చెందుతారు. కాబట్టి... కండరాలు బలంగా ఉంచుకునేందుకు దానికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ఉత్తమం. దీనికి సంబంధించిన వ్యామాలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి,

3.ఇక సెక్స్ చేస్తూనే.. మధ్య మధ్యలో ఆపుతూ.. మళ్లీ మొదలుపెడూతూ ఉండాలట. అలా మధ్య మధ్యలో ఆఫడం వల్ల తొందరగా స్కలనం జరగకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు.. కలయికను ఆస్వాదించవచ్చు.

4.కలయికలో పాల్గొంటున్న సమయంలో.. వేగంగా చేయడం వల్ల కూడా తొందరగా భావప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి.. నెమ్మదిగా మొదలుపెట్టి.. నెమ్మదిగా కలయికను ఆస్వాదిస్తూ ఉంటే..అప్పుడు ఎక్కువ సేపు ఎంజాయ్ చేయగలరు.

sex

5.ఇక.. కలయిక ఎక్కువ ఎంజాయ్ చేయాలి అనుకున్నవారు.. కలయికలో పాల్గొనడానికి ముందు.. స్వయంతృప్తి లో పాల్గొనాలి. అప్పుడు... కలయిక సమయంలో తొందరగా స్కలనం చెందరు. అప్పుడు ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేసిన తృప్తి లభిస్తుంది.

6.ఇవన్నీ చేసిన తర్వాత కూడా. ఇంకా ఎక్కువ సేపు కలయికలో పాల్గొనాలనే కోరిక కలిగితే.. కొంత మొత్తంలో వయాగ్రా తీసుకోవచ్చు. అయితే.. మరీ ఎక్కువగా తసుకోకూడదు. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

7.ఎప్పుడూ ఒకే పొజిషన్ లో కలయికను ఆస్వాదించడం వల్ల కూడా పెద్దగా కిక్ ఉండకపోవచ్చు. అలా కాకుండా.. అప్పుడప్పుడు విభిన్న పొజిషన్స్ ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ప్రయత్నించడం వల్ల.. కలయికలో ఎక్కువ సేపు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

click me!