కలిసి స్నానం చేయాలనుకుంటున్నారా? అంతకంటే ముందు మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి

First Published May 27, 2023, 9:40 AM IST

భార్యాభర్తలకు కలిసి స్నానం చేయాలని ఉంటుంది. ఈ స్నానం కాస్త ఇద్దరినీ సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. నిజానికి షవర్ సెక్స్ ఇద్దరికీ మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే సమయం దొరికినప్పుడల్లా కలిసి స్నానం చేస్తుంటారు. కానీ ఇంతకంటే ముందు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. 
 

భాగస్వామితో స్నానం చేయడం నిజంగా సెక్సీగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది భార్యాభర్తలు ఏకాంతసమయంలో ఇలా కలిసి స్నానం చేయాలనుకుంటారు. జస్ట్ స్నానం అనుకుంటే పొరపాటే. ఈ స్నానం ఇద్దరినీ సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. షవర్ సెక్స్ మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఎగ్జైటింగ్ గా అనిపించినప్పటికీ.. బాత్రూమ్ సెక్స్ చాలా కష్టం. ఇది ఊహించని విధంగా ఉంటుంది. ఎందుకంటే బాత్ రూం మొత్తం తడిగా ఉంటుంది. ఏమాత్రం కాలు స్లిప్ అయినా మీరు పడిపోవడం గ్యారంటీ. అందుకే షవర్ సెక్స్ కు ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే..

Image: Getty

ఎక్కడ చూసినా నీళ్లే!

షవర్ లో ఎక్కడి నుంచైనా నీళ్లు పడుతూనే ఉంటాయి. దీంతో మీ బాత్ రూం మొత్తం తడిగా మారుతుంది. అందులోనూ షవర్ లో మీకు మరింత చల్లగా అనిపించొచ్చు. ఎందుకంటే హైటెక్ షవర్ ఉంటే తప్ప వేడి నీళ్లు మీపై పడవు. అందుకే కలిసి స్నానం చేస్తుంటే మీరు, మీ భాగస్వామి అప్పుడప్పుడు మీ ప్లేస్ లను మారుస్తూ ఉండండి. దీంతో మీరు కంఫర్ట్ గా ఉంటారు. 
 

సిద్ధంగా ఉండాలి

బాత్ రూం మొత్తం తడి, అందులోనూ సబ్బు వీటికారణంగా మీరు జారిపడే అవకాశం ఉంది. అందుకే మీరిద్దరూ దీనికోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. బాత్ రూం పొడి టవల్స్ ను అందుబాటులో పెట్టుకోండి. అలాగే బాత్రూం లో నాన్ స్లిప్ మ్యాట్ ను కూడా ఉంచండి. దీంతో మీరు జారిపోయే అవకాశాలు ఉండవు. 

లూబ్రికేషన్ 

షవర్ సెక్స్ మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది. అయితే చాలా మంది షవర్ సెక్స్ కు లూబ్రికేషన్ అవసరం లేదనుకుంటారు. షవర్ లో ఉన్నప్పుడు సెక్స్ చాలా సులభం అనికూడా భావిస్తారు. ఇది ఇది తప్పు. ఎందుకంటే నీరు మీపై పడటం వల్ల సహజ కందెన మొత్తం పోతుంది. అందుకే మీరు షవర్ సెక్స్ లో పాల్గొంటే షవర్ లో ఉపయోగించగల కొన్ని లూబ్రికేషన్స్ ను  తీసుకెళ్లండి.
 

ఆందోళనలను వదిలేయండి

మీరు, మీ భాగస్వామి కలిసి స్నానం చేయడానికి వాష్ రూమ్ లోకి వెళ్లినప్పుడు భయం, ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని పూర్తిగా వదిలేయండి. నిజానికి కలిసి స్నానం చేస్తే ఒత్తిడి తొలగిపోతుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాలను మాట్లాడకూడదు. అదేంటంటే.. కలిసి స్నానం చేసేటప్పుడు ఒత్తిడితో కూడిన అన్ని విషయాల గురించి మాట్లాడటం. ఇలా చేస్తే మీ భాగస్వామికి ఇబ్బంది కలిగించిన వారవుతారు. ఇది విభేదాలకు దారితీస్తుంది. ఇద్దరూ ఏకాంత సమయాన్ని కోరుకున్నప్పుడు షవర్ లో ఆనందంగా గడపండి. ఇది మీకు స్వర్గంగా ఉండాలి.

click me!