సెక్స్ సమయంలో ఆడవాళ్లు అస్సలు చేయకూడని పనులు ఇవే..!

First Published | Dec 6, 2023, 3:59 PM IST

శృంగారం యాంత్రికంగా అస్సలు ఉండకూడదు. సెక్స్ సమయంలో భావోద్వేగ కనెక్షన్ చాలా ముఖ్యం. సెక్స్ సమయంలో ఆడవారు వాళ్లు చేసే కొన్ని తప్పులు భర్తకు విసుగు తెప్పిస్తాయి.
 

Image: Getty

సెక్స్ సమయంలో తెలిసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఇవి మీ భాగస్వామికి మీపై కోపాన్ని తెప్పిస్తాయి. అంతేకాదు ఆ పొరపాట్లు మీ భాగస్వామి లైంగిక ఆనందాన్ని కూడా దూరం చేస్తాయి. కాబట్టి సెక్స్ గురించి మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మగవారే కాదు ఆడవారు కూడా సెక్స్ సమయంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ తాము చేసింది తప్పని వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ ఇవి మీ భాగస్వామికి కోపాన్ని తెప్పిస్తాయి. విసుగుపెట్టిస్తాయి. అందుకే కలయిక సమయంలో ఆడవారు చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Latest Videos


ఎలాంటి స్పందన లేకపోవడం

సాధారణంగా భార్యాభర్తలిద్దరూ శారీరక సంబంధాన్ని కోరుకుంటుంటారు. అలాగే ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది మహిళలు పెద్దగా పట్టించుకోరు. సెక్స్ సమయంలో భాగస్వామిని పట్టుకోవాల్సిన, ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటుంటారు. కానీ ఇది మీ భాగస్వామికి మీరు ఉన్నా లేనట్టుగా అనిపిస్తుంది. మీ భాగస్వామి మీ నుంచి ఏదైనా స్పందనను ఆశిస్తారు. ఇది వారి ప్రేరణను తగ్గిస్తుంది. లేదా మీ భర్త మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే కలయిక సమయంలో మీ భర్తను ముద్దు పెట్టుకోవడమో లేదా సెక్స్ గురించి మాట్లాడటమో చేయండి. 

శరీరంలోని ఇతర భాగాలను విస్మరించడం

సెక్స్ సమయంలో స్త్రీ లేదా పురుషుడి శరీరంలోని ఎన్నో భాగాలు ఉత్తేజితమవుతాయి. అందుకే సెక్స్ సమయంలో ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మహిళలు ఈ భాగాలపై దృష్టి పెట్టాలి. సెక్స్ సమయంలో ఈ భాగాలను నిర్లక్ష్యం చేయకూడదు. మీ భాగస్వామి  మోకాళ్లు, మణికట్టు, వీపు, కడుపు వంటి శరీరంలోని ఇతర ఉత్తేజపరిచే ప్రాంతాలను టచ్ చేయండి. ఇది భాగస్వామిని మరింత సంతోషపెడుతుంది. ఇది శృంగారం కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. 

మీ గురించి ఆలోచించడం

కొంతమంది ఆడవారు సెక్స్ సమయంలో తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంటే తమ లైంగిక ఆనందానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. భాగస్వామికి ఏం కావాలో పట్టించుకోరు. ఇది కూడా మీ భర్తకు చిరాకు, కోపం తెప్పిస్తాయి. 

sex life

అందం పై దృష్టి 

ఎప్పుడూ అందంగా కనిపించడానికి ఇష్టపడే మహిళ సెక్స్ సమయంలో కూడా వారి మనసు మార్చుకోరు. ఆ టైమ్ లో కూడా ఆమె తన అందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది. అంటే ఈ సమయంలో ఆమె లుక్స్ ఎలా ఉన్నాయో అని చెక్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా భర్తకు చిరాకు కలిగిస్తుంది. 
 

Image: Getty Images

బిడియం

చాలా మంది మహిళలు సిగ్గు కారణంగా శృంగారాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోతుంటారు. కానీ ఈ సిగ్గు మీ భాగస్వామిని కూడా సంతోషపెట్టదు. ఎందుకంటే మీరు మీ భర్త ముందు నగ్నంగా ఉండటానికి సిగ్గుపడే భార్యను చూస్తే భర్తకు చిరాకొస్తుంది. ఇలాంటి ఆడవారు బెడ్ షీట్ ను ఒంటికి కప్పుకుంటుంటారు. 
 

Image: Getty Images

మధ్యలో సెక్స్ నిరాకరణ

ఫోర్ ప్లేకు సహకరించే మహిళలు మధ్యలో శృంగారానికి నిరాకరిస్తుంటారు. ఒక్క క్షణంలోనే మూడ్ మారిపోతూ ఉంటుంది. కానీ ఇది మీ భాగస్వామిని బాధపెడుతుంది. ఇది వారి కోరికలను చంపేస్తుంది. 
 

Image: Getty Images


భాగస్వామిని చూసి నవ్వడం

భార్య సంతోషంగా ఉండాలనే ప్రతి భర్త కోరుకుంటాడు. కానీ వారు అకాల స్ఖలనం చేస్తే వారు అవమానకరంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీరు నవ్వితే అతను మరింత అవమానకరంగా భావిస్తాడు. దీంతో అతను ఎంతో బాధపడతాడు. 

Image: Getty Images

నకిలీ భావప్రాప్తి

చాలా మంది మహిళలు తమ భర్తల ఆనందం కోసం నకిలీ భావప్రాప్తికి చేరుకుంటారు. అంటే వీళ్లు భావప్రాప్తికి చేరుకోకున్నా.. తమ భర్త బాధపడకూడదని భావప్రాప్తి పొందినట్టు డ్రామాలు ఆడుతారు. కానీ దీనివల్ల మీ భర్త పురోగతి సాధించడం కష్టం.

click me!