సెక్స్ లో పాల్గొనడానికి కూడా అలసటగా అనిపించే రోజులు ఉండే ఉంటాయి. నిద్ర లేకపోవడం లేదా ఆఫీసు లేదా ఇంట్లో పని ఎక్కువ కావడం వల్ల ఇలా అనిపిస్తుంది. ఆఫీసు పనితో పాటుగా పిల్లలు, జీవిత భాగస్వామి లేదా వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కూడా అలసిపోతారు. కానీ ఈ అలసట మిమ్మల్ని లైంగిక కార్యకలాపాలకు దూరం చేస్తుంది. కానీ మంచి సెక్స్ మీ మానసిక స్థితిని, శక్తిని మార్చగలదు. మీరు అలసిపోయినప్పుడు కూడా సెక్స్ ను ఆస్వాదించొచ్చు. అలసిపోయిన రోజు తర్వాత శృంగారాన్ని ఎలా ఆస్వాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి లైంగిక జీవితం ఒత్తిడిని తగ్గించడం, ఆనందం, హార్మోన్ల నియంత్రణ, మంచి నిద్ర వంటి శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2019 పరిశోధన ప్రకారం.. నెలకు కనీసం రెండుసార్లు స్థిరమైన సెక్స్ మానసిక, శారీరక శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రతిరోజూ అలసటగా అనిపిస్తే ఇలా శృంగారాన్ని ఆస్వాదించండి
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి
స్ట్రెయిట్ సెక్స్ కు సిద్ధపడే బదులుగా రిలాక్స్ అవ్వడానికి టైంను కేటాయించండి. ఇందులో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, యోగా చేయడం, మిడ్ ఫుల్నెస్ సాధన చేయడం వంటివి చేయండి. మీ మనస్పు ప్రశాంతంగా ఉంటే ఉత్సాహంగా, ఆనందంగా సెక్స్ లో పాల్గొంటారు.
మీ భాగస్వామితో మాట్లాడండి
ఆరోగ్యకరమైన సంబంధంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. భాగస్వామితో మాట్లాడితే మీ సంబంధం బలపడుతుంది. ఇది మంచి శృంగారానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మంచి పోషకాహారం
మీరు రిలాక్స్ అయిన తర్వాత ఆకలిని తగ్గించుకోండి. ఇందు కోసం మంచి పోషకాహారం తినండి. అలాగే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. ఇది సెక్స్ వంటి కార్యకలాపాలు చేయడానికి మీకు శక్తిని ఇస్తుంది.
ఫోర్ ప్లే
క్యాండిల్స్, మ్యూజిక్, దుప్పట్లు, ఒక సినిమాతో మీ మూడ్ సెట్ చేయండి. ఇవి మీ ఫోర్ ప్లేలో భాగం కావచ్చు. ఇది సౌకర్యవంతమైన సెక్స్ కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అలాగే సుగంధ నూనెలు, మ్యూజిక్ మీ ఇంద్రియాలను యాక్టీవ్ గా చేస్తాయి.
Boring Sex Life
స్వీయ ఆనందాన్ని ప్రయత్నించండి
మీకు భాగస్వామి ఉన్నా లేకపోయినా.. హస్త ప్రయోగం మీకు మంచి ప్రయోజకరంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. శారీరక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది.
అవసరాలను గుర్తించడం
అప్పుడప్పుడు సెక్స్ లో అస్సలు పాల్గొనాలనిపించదు. శారీరక అలసట లేదా ఇతర కారణాల వల్ల కావొచ్చు. మీరు, మీ భాగస్వామి ఒకే సమయంలో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడకపోవచ్చు. ఇది చెడ్డ విషయమేమీ కాదు. మీ అవసరాలను గుర్తించండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇది మీ లైంగిక జీవితాన్ని సాఫీగా ఉంచుతుంది.