మీ భాగస్వామితో మరింత రొమాంటిక్ గా ఉంచే టిప్స్ ఇవి..

First Published Jan 12, 2024, 2:14 PM IST

రిలేషన్ షిప్ లో మీరు లైంగికంగా మరింత చురుగ్గా ఉండేందుకు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. లేదంటే మీ మధ్య బంధం బలహీనపడుతుంది. మీరు మీ భాగస్వామితో మరింత రొమాంటిక్ గా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదంది. 
 

9 types of couples in relationship

రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరికోసం ఒకరు ఎన్నో పనులను చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి మీ బంధాన్ని కాపాడుతాయి. మీ ఇద్దరి మధ్యన ప్రేమను పెంచుతాయి. మీ వైవాహిక జీవితాన్ని మధురంగా ఉంచుతాయి. అయితే ప్రస్తుతం చాలా జంటలు బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఒకరికోసం ఒకరు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కమ్యూనికేషన్ తగ్గుతుంది. ఇది చివరికి మీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తుంది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా.. భాగస్వామి కోసం కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సిందే. ఇవి మీ బంధాన్ని బలంగా ఉంచడమే కాకుండా.. మీరు మరింత రొమాంటిక్ గా ఉండటానికి కూడా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రశంసించండి

బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఏం తింటున్నామో కూడా కొందరు మగవారు గమనించరు. కానీ భార్యలు తమ భర్తల కోసం వారికి ఇష్టమని రకరకాల వంటలను వండుతుంటారు. ఇలాంటప్పుడు మీరు వారిని ఖచ్చితంగా ప్రశంసించాలి. ఇది జస్ట్ చిన్న విషయమే అయినా.. ఇదే వారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే ఉదయం వారితో కలిసి తినండి. వాళ్లు చేసిన వంటలకు ప్రశంసించండి. ఇలా వారిని పొగడటం వల్ల వారికి మీపై ఒక నమ్మకం కలుగుతుంది. మీరు వారితో సంతోషంగా ఉన్నారని భావిస్తారు. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా వారికి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. 
 

కలిసి గడపడం

ఉరుకుల పరుగుల జీవితంలో కలిసి చాలా సేపు గడపడం అంటే మామూలు మాటలు కావంటారు చాలా మంది. అందుకే ప్రస్తుతం చాలా జంటలు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే మాత్రం మీరు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపాల్సిందే. మీరిద్దరు  ఆనందంగా ఉండే డేట్స్ లేదా పార్టీలను ప్లాన్ చేయండి. ఇది మీరిద్దరు మరింత కనెక్ట్ అయ్యేలా ఇది చేస్తుంది. క్యాండిల్ లైట్ డిన్నర్, వాకింగ్, వారాంతపు విహారయాత్ర అయినా, ఒకరిపై ఒకరు సమయాన్ని వెచ్చించడం వల్ల మీ లైంగిక జీవితం బాగుంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య దూరం రాకుండా ఉంటుంది. కలిసి సమయాన్ని గడపడం వల్ల మీ ఇద్దరికీ మంచి అనుభూతి కలుగుతుంది. 
 

Relationship stages

సర్ప్రైజ్

సర్ ప్రైజ్ లు కూడా మీ మధ్య దూరాన్ని తగ్గించి, మీ మధ్యన ప్రేమను పెంచుతాయి. మీరిచ్చే సర్ప్రైజ్ చిన్నదైనా పెద్దదైనా.. మీ బంధాన్ని మరింత ఉత్సాహంగా చేస్తుంది. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామి గురించి ఆలోచిస్తున్నారని, మీ జీవితంలో వారిని కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉన్నారని చూపిస్తుంది.  ఇందుకోసం మీరు వారికోసం స్పెషల్ గా బ్రేక్ ఫాస్ట్ ను రెడీ చేయడం లేదా హఠాత్తుగా మంచి నైట్ ను ప్లాన్ చేయొచ్చు . ఇవి భాగస్వామితో మంచి సంబంధానికి దారితీస్తాయి. 
 

కమ్యూనికేషన్

భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. నిజాయితీ గల కమ్యూనికేషన్ బలమైన, శృంగార సంబంధానికి పునాదిని ఏర్పరుస్తుంది. మీ భావాలను, కలలను, భయాలను మీ భాగస్వామితో పంచుకోండి. ఇది మంచి భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కలిగిస్తుంది. అలాగే మీరు మనసువిప్పి మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించండి. ఒకరి మాటలను ఒకరు వినండి. అనుభవాలను పంచుకోండి. ఇది మీ భాగస్వామికి మానసికంగా దగ్గర కావడానికి, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

వినండి

ఎలాంటి సంబంధానికైనా కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో.. భాగస్వామి మాటలను వినడం కూడా అంతే ముఖ్యం. మీ భాగస్వామి ఆలోచనలు, అవసరాలపై శ్రద్ధ పెట్టండి. వారి ఆలోచనలు, భావాలు, దృక్పథాలను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. వారు చెప్పేదానిపై ఆసక్తిని కనబరచండి. వారి అనుభవాలను తెలుసుకోండి. ఇది మీ భాగస్వామికి మానసికంగా దగ్గర కావడానికి, వారితో మంచి సంబంధాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. 

శారీరక స్పర్శ

ప్రేమను తెలియజేయడానికి, సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి శారీరక స్పర్శ ఒక శక్తివంతమైన సాధనం. అంటే భాగస్వామిని కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి మీ మధ్య ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ భాగస్వాముల మధ్య శృంగార సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అందుకే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి మీ భాగస్వామికి శారీరకంగా దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి.

click me!