ఆస్ట్రేలియాకు షాక్.. భార‌త్ ను సౌతాఫ్రికా దెబ్బ‌కొడుతుందా?

Published : Nov 30, 2024, 11:48 PM IST

WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసు మ్యాచ్ మ్యాచ్ కు మారుతూ మ‌రింత అస‌క్తిని పెంచుతోంది. బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీలో పోటీ ప‌డుతున్న భార‌త్-ఆస్ట్రేలియాలు ఈ రేసులో ఉండ‌గా, తాము తక్కువేమీ కాదంటూ మరో టీమ్ పోటీలోకి దూసుకొచ్చింది.

PREV
15
ఆస్ట్రేలియాకు షాక్.. భార‌త్ ను సౌతాఫ్రికా దెబ్బ‌కొడుతుందా?
WTC Points Table, WTC, Cricket

World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న జ‌ట్ల‌కు షాక్ ఇచ్చింది కొత్త జ‌ట్టు. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో పెద్ద మార్పు జరిగింది. తొలి టెస్టులో శ్రీలంకను ఓడించిన దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను భర్తీ చేసింది. శనివారం కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకపై 233 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన దక్షిణాఫ్రికా WTC పట్టికలో భార‌త్ త‌ర్వాతి స్థానంలో ఉంది. కేవ‌లం రెండు పాయింట్లు మాత్ర‌మే త‌క్కువ‌గా ఉంది. టాప్ ప్లేస్ కోసం ఈ మూడు జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

25

భారత కు షాక్ త‌గులుతుందా? 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్ర‌స్తుతం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఫైనల్‌కు చేరుకోవడానికి ఓటమి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. భారత్ 61.11 పాయింట్ల‌తో డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు 59.26 పాయింట్లు, మూడో స్థానంలో ఉన్న‌ ఆస్ట్రేలియాకు 57.69 పాయింట్లు ఉన్నాయి. అయితే, మిగిలిన నాలుగు టెస్టుల్లో మూడింటిలో ఆస్ట్రేలియాను ఓడిస్తే భారత్ వచ్చే ఏడాది ఫైనల్ ఆడడం ఖాయం కానీ, ఇది అంత ఈజీ కాదు. 

35

దక్షిణాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ 

మార్కో జాన్సెన్ నేతృత్వంలోని ప్రోటీస్ బౌలింగ్ దాడి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను రెండో ఇన్నింగ్స్‌లో చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయింది. 1991లో దక్షిణాఫ్రికా క్రికెట్‌లోకి తిరిగి ప్రవేశించిన తర్వాత పది వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా జెన్సన్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్‌ కష్టాల్లో పడింది. ఒక వికెట్ తర్వాత మరొకటి పడిపోయిన తరువాత, కెప్టెన్ టెంబా బావుమా 70 పరుగుల ఇన్నింగ్స్ అతని జట్టును 191/10 ప‌రుగులు చేసింది. 

45
Kane Williamson

42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల మార్కును దాటలేకపోవడంతో.. రెండో రోజు విపరీతమైన ఒత్తిడికి లోనైన ప్రొటీస్ బౌలర్లు మైదానంలోకి దిగి అద్భుత ప్రదర్శన చేశారు. మార్కో జాన్సెన్ అద్భుతమైన 6.5 ఓవర్ స్పెల్‌లో ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ ఏడు వికెట్లు తీశాడు. కగిసో రబడ (1), గెరాల్డ్ కోయెట్జీ (2) సాయంతో శ్రీలంక‌ 42 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 149 పరుగుల ఆధిక్యం అభించింది. 

55

స్టబ్స్-బావుమా అద్భుతమైన సెంచరీలు

రెండో ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (122), బావుమా (113)లు శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తరఫున నాలుగో వికెట్‌కు 249 పరుగుల అతిపెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 2012లో కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్ నెలకొల్పిన 192 పరుగుల రికార్డును బద్దలు కొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో 366/5 స్కోరు వద్ద ప్రోటీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, శ్రీలంక‌ 282 పరుగులకే ఆలౌట్ అయి.. 233 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 

click me!

Recommended Stories