బిగ్‌ బాస్ షోలో అవినాష్‌ సంచలనం.. టేస్టీ తేజ ఔట్‌, నెక్ట్స్ ఎలిమినేట్‌ అతనేనా?

First Published | Nov 30, 2024, 11:53 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ముగింపుకి చేరుకుంది. 13వ వారంలో మొదటి ఎలిమినేషన్‌ అయిపోయింది. ఇక రెండో ఎలిమినేషన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

డబుల్‌ ఎలిమినేషన్‌లో మొదట అవినాష్‌ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపించింది. అయితే ఫినాలే టికెట్ సంపాదించడంతో అవినాష్‌ సేఫ్‌ అయ్యారు. ముందుగానే ఆయన నామినేషన్‌ నుంచి తప్పించారు హోస్ట్ నాగార్జున. శనివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఉంటుందనే విషయం తెలిసిందే.

ఆయన వచ్చి ఎవరి తప్పులు ఏంటనేది తేలుస్తారు. ఎవరు మిస్టేక్స్ చేశారో చెబుతారు. ఈ వారం కూడా చేశారు. గోల్డ్ టికెట్‌, బ్లాక్‌ టికెట్‌ ఇచ్చాడు. ఇందులో ఈ వారం బాగా ఆడిన గౌతమ్‌, రోహిణి, నిఖిల్‌, అవినాష్‌లకు గోల్డ్ టికెట్‌ లభించింది. 
 


తప్పులు చేసి, సరిగా గేమ్స్ ఆడని ప్రేరణ, తేజ, పృథ్వీరాజ్‌, విష్ణు ప్రియాలకు బ్లాక్‌ టికెట్‌ దక్కింది. అనంతరం ఎవరిలో దమ్ముంది, ఎవరు దుమ్ము అనేది తేల్చాలని చెప్పాడు నాగ్‌. ఇందులో ఎక్కువ మంది నబీల్‌కి దమ్ము ఉందని, తేజ దుమ్ము అని తేల్చారు.

ఈ రకంగా దమ్మున్న కంటెస్టెంట్‌గా నబీల్‌ ఉంటే, దుమ్ము కంటెస్టెంట్‌గా తేజ నిలిచారు. ఇక్కడే అసలు ఆట అర్థమైపోతుంది. ఇక్కడే ఈ వారం ఎలిమినేషన్‌ అనేది తేలిపోయిందని చెప్పొచ్చు. 
 

డబుల్‌ ఎలిమినేషన్‌లో మొదటి ఎలిమినేషన్‌ ఫైనల్‌ చేశాడు నాగార్జున. డైరెక్ట్ గా ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో చెప్పారు. ఇందులో తేజ ఎలిమినేట్‌ కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన చెబుతూ మా అమ్మ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చింది అదే తన సక్సెస్‌ అని, దీంతో తన డ్రీమ్‌ నెరవేరిందని,

అయినా ఇంకా రెండు వారాలు ఇందులో ఉండటం ఈ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసినట్టు తెలిపారు తేజ. అనంతరం స్టేజ్‌పైకి వెళ్లి ఆయన ఒక్కొక్కరి గురించి చెప్పారు. వెజిటేబుల్స్ లో ఎవరికి ఏది సూట్‌ అవుతుందో తెలిపారు. అవినాష్‌ ఉల్లిపాయ అని, బాగా ఆడతాడని తెలిపారు. 

రోహిణి ఆలుగడ్డ అని, టాప్‌ 5లో ఉండాలని, అదే సమయంలో నామినేషన్‌లోకి రావాలని తెలిపాడు తేజ. విష్ణు ప్రియా కాకరకాయ అని, గేమ్‌ బాగా ఆడాలని, తప్పించుకోవద్దని తెలిపారు. ప్రేరణ బెండకాయ అని నోరు అదుపులో పెట్టుకుని గేమ్‌ ఆడాలన్నాడు. పృథ్వీ రాజ్‌ పచ్చి మిర్చీ అని, ఆవేశం కంట్రోల్‌ చేసుకోవాలని, తనలో మంచి ఫన్నీ యాంగిల్‌ ఉందన్నారు.

గౌతమ్‌ క్యాబేజీ అని, ఎన్నిసార్లు ఏం చేసినా పొరలు పొరలుగా వస్తూనే ఉంటాడని చెప్పాడు. టాప్‌ 2 కంటెస్టెంట్‌ అని చెప్పాడు. నిఖిల్‌ సొరకాయ అని, టాప్‌ 2లో ఉంటావన్నాడు. నబీల్‌ టమాటా అని, ఇంకా బాగా ఆడాలని, ప్రస్తుతం టాప్‌ 5లో అని, టాప్‌ 3లోకి రావాలని చెప్పాడు తేజ. 
 

ఈ వారం మొదటి ఎలిమినేషన్‌ టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. మరి ఈ వారం రెండో ఎలిమినేషన్‌ ఎవరిది అనేది సస్పెన్స్ గా మారింది. అయితే అవినాష్‌ అవుతాడని అనుకున్నారు. ఆయన సేవ్‌ అయి గ్రాండ్‌గా ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు అసలు కత్తి పృథ్వీపై ఉంది.

దీంతోపాటు విష్ణు ప్రియాకి కూడా ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. పృథ్వీరాజ్‌ ఎలిమినేట్‌ అని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో విష్ణు ప్రియా పేరు కూడా వినిపిస్తుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. 
 

అవినాష్‌ మాత్రం సంచలనం సృష్టించారు. ఓ పెద్ద సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ షోలో కామెడీని పంచే, కమెడియన్లు టాప్‌ 5లోకి వచ్చింది లేదు. చాలా వరకు ఇతర కంటెస్టెంట్లు మాత్రమే టాప్‌లో ఉండేవారు. ఎంటర్‌టైన్‌ చేసే వారిని కూరలో కరివేపాకులానే తీసేస్తుంటారు. ఈ సారి కూడా అదే జరుగుతుందనుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేశాడు అవినాష్‌. సంచలనం సృష్టిస్తూ ఫినాలోకి వెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. గ్రాండ్‌గా ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున సమక్షంలోనే ఇది జరగడం విశేషం. 

read more: బిగ్ బాస్ విన్నర్ కు అరుదైన వ్యాధి..? అభిజిత్ అందుకే ఇండస్ట్రీకి దూర అయ్యాడా..? ఇలా అయిపోయాడేంటి..?

also read: సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడను.. తెగేసి చెప్పిన స్టార్‌ సింగర్‌, ఇద్దరికి గొడవేంటి?

Latest Videos

click me!