హస్త ప్రయోగంతో ఎన్నో లాభాలు.. కానీ?

First Published | Jan 7, 2024, 2:01 PM IST

హస్త ప్రయోగం అంత చెద్దడేం కాదంటారు నిపుణులు. ఎందుకంటే ఇది మగవారికి, ఆడవారికి ఎన్నో మానసిక, శారీరక ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ హస్త ప్రయోగం చేసే ఆడవారు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

masturbating

హస్తప్రయోగం అనే పదం వినగానే.. వీళ్లేంటి తేడా అన్నట్టుచూస్తుంటారు. నిజానికి మగవారే కాదు.. ఆడవారు కూడా హస్తప్రయోగం చేస్తారు. ఈ హస్త ప్రయోగం మీకు శారీరక ఆనందాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. హస్త ప్రయోగం ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. యోని ఆరోగ్యానికి కూడా కూడా సహాయపడుతుంది. కానీ తప్పుగా చేస్తే హస్తప్రయోగం వల్ల కూడా ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆడవాళ్లు హస్తప్రయోగం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పరిశుభ్రత ముఖ్యం

మిమ్మల్ని మీరు తాకే ముందు.. మీ యోని ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ వేళ్లు ఎన్నో బ్యాక్టీరియాలకు నిలయం. వాటిని శుభ్రం చేయకపోవడం వల్ల మీ సన్నిహిత పరిశుభ్రతకు హానికరం. అందుకే హస్తప్రయోగంలో పాల్గొనే ముందు మీ చేతులను బాగా కడగండి. 
 

Latest Videos


గోర్లు ప్రమాదకరం

మీ గోర్లు పెద్దవిగా ఉంటే మీ యోని ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే గోర్లు ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియాలకు నిలయం. అందులోనూ హస్తప్రయోగం చేసేటప్పుడు వేళ్లను ఉపయోగిస్తే.. ఈ వైరస్ లు, బ్యాక్టీరియాలు మీ యోనిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. గోర్లు పెద్దగా లేదా పదునుగా ఉంటే వాటిని కట్ చేయండి. గోర్లు పెద్దగా ఉంటే.. యోని చర్మానికి గాయాలవుతాయి. ఈ గాయాలలోకి గోరు బ్యాక్టీరియా సౌకర్యవంతంగా ప్రవేశిస్తుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

రసాయనాలకు దూరంగా ఉండండి

కాస్మోటిక్ లోని రసాయనాలు మీ యోని ఆరోగ్యానికి ప్రమాదకరం. మీరు హస్త ప్రయోగం కోసం మీ చేతులను ఉపయోగిస్తుంటే.. సెషన్ కు ముందు ఎలాంటి క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ పెట్టకూడదు. మాయిశ్చరైజర్ లో పారాబెన్ ఉంటుంది. ఇది మీ యోని పీహెచ్ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. మీరు వీటికి బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు.

 సెక్స్ బొమ్మలపై ప్రత్యేక శ్రద్ధ 

మీ శరీరంలోకి వెళ్లే ఏదైనా ఉత్పత్తి మురికిగా ఉండకూడదు. మీరు వైబ్రేటర్లు మొదలైన వాటిని ఉపయోగిస్తే.. వాటిని కడగకుండా అస్సలు ఉపయోగించకూడదు. అలాగే వాటిని పొడిగా ఉంచండి. లేకపోతే ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుతుంది. 
 

click me!