పండుగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

First Published | Nov 28, 2024, 4:05 PM IST

పండుగలప్పుడు ఖచ్చితంగా ఇంటికి మామిడి తోరణాలను కడుతుంటాం. ఇది ఎన్నటినుంచో వస్తున్న ఆచారం. కానీ ఈ తోరణాలు కట్టడానికి కారణాలేంటో తెలుసా?

ఇంట్లో ఏ శుభకార్యం చేసినా, ఏ పండుగలొచ్చినా ఇంట్లోని ప్రతి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలను కడుతుంటాం. ఇది ఇప్పుడిప్పుడు పాటిస్తున్న ఆచారం కాదు. ఎన్నో ఏండ్ల నుంచి ఇది కొనసాగుతూ వస్తోంది. ఈ తోరణాలు మన ఇంటిని అందంగా మార్చేస్తాయి. అందుకే కడతారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ తోరణాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని పెద్దలు నమ్ముతారు.

శుభ సమయాల్లో మామిడి తోరణాలను గుమ్మాలకు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటకు పోతాయని నమ్ముతారు.  

అలాగే దేవాలయాల ఉత్సవాల్లో కూడా తోరణాలను ఖచ్చితంగా కడతారు. ఇవి శుభప్రదమైన రూపాన్ని కలిగిస్తాయని పండితులు చెప్తారు. ఈ మామిడి తోరణాలను తయారుచేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వీటిని దీపావళి, సంక్రాంతి వంటి పండగలు, పెళ్లి వంటి శుభకార్యాల్లో ఖచ్చితంగా కట్టాలని చెప్తారు. అసలు ఇంటి గుమ్మాలకు తోరణాలను ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తోరణాల ప్రయోజనాలు

మనకు తెలియని ఎన్నో విషయాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఇవి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదని పండితులు చెప్తారు. వీటికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా ఉంటుంది. మన తాతలు, ముత్తాతలు ఎన్నో ఏండ్లుగా పాటిస్తున్న చాలా ఆచారాలు శాస్త్రీయంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిరూపించబడ్డాయి.

మీకు తెలుసా? ఒకప్పుడు శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చే ఆచారమే లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే దానికి గుర్తుగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టేవారు. తోరణాలను చూసి వీళ్లు ఏదో శుభకార్యం చేస్తున్నారని ఇరుగుపొరుగువారు అర్థం చేసుకునేవారట. ఒకవేళ తోరణం కట్టకపోయినా.. ఇంటి వాకిట్లో మామిడి ఆకులు, వేప ఆకులను ఉంచేవారట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


మామిడి ఆకుల తోరణం

మామిడి తోరణాలను  హిందూ మతంలో శుభసూచకంగా భావిస్తారు. అందుకే నేటికీ అన్ని పండుగలకు గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ముఖ్యంగా శుభ దినాల్లో ఇంటి ప్రధాన గుమ్మానికి, గేటుకు మామిడి తోరణాన్ని ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే దీని వల్ల చెడు శక్తులు ఇంట్లోకి రావని నమ్ముతారు. 

ఇంటి వాకిట్లో మామిడి తోరణం ఎలా కట్టాలి?

మామిడి తోరణాలను కట్టడానికి ఒక పద్దతి ఉంటుంది. ముందుగా పసుపు రాసిన దారానికి మామిడి ఆకులను తోరణంగా కట్టుకోవాలి. అలాగే ఈ మామిడి ఆకులకు పసుపు రాసి, దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. దీన్ని నీడలో ఆరబెట్టి ఇంటి వాకిట్లో కట్టాలని చెప్తారు. అంతేకానీ మామిడి తోరణాన్ని అలాగే కట్టకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

మామిడి తోరణంలో 11 మామిడి ఆకులను మాత్రమే వాడాలి. ఇంతకంటే ఎక్కువైతే 21 లేదా 101 ఆకులతో తోరణాన్ని ఏర్పాటు చేసి కట్టాలి. 

పండగలప్పుడు ఒక్క మామిడితోరణంతో పాటుగా వేప ఆకులను కూడా కడతారు. ఈ మామిడి ఆకులు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకంగా ఉంటాయి. ఈ ఆకులు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. మనం పీల్చే ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఈ మామిడి తోరణాలు ఇంట్లో, బయటున్న చెడు శక్తులను తొలగిస్తాయి. ఇంటికి మంచిచేస్తాయని నమ్ముతారు. 

మామిడి తోరణాల ప్రత్యేకత

మామిడి ఆకులకు, వేప ఆకులను మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేప ఆకుల్లో ఆదిశక్తి ఉంటే. వేప ఆకుల్లో మహాలక్ష్మి ఉంటారని నమ్ముతారు. మామిడి తోరణాలు మన మనసులో మంచి ఆలోచనలను కలిగిస్తాయి. అలాగే  గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. ఇకపోతే వేప ఆకులు గాల్లోని విష పదార్థాలను పీల్చుకుంటాయి. ఇవి రెండు ఆకులు ఎండిపోతాయి . కానీ కుళ్లిపోవు. అందుకే వీటిని తోరణాలుగా వాడతారు. 

తోరణాల ప్రయోజనాలు

వేప ఆకుల తోరణం:

వేప తోరణాన్ని పసుపు పూసిన దారంతో తయారుచేస్తారు. ఇలాంటి తోరణాలను ఎక్కువగా అమ్మవారి జాతర్లలో వాడతారు.  అలాగే జాతరలప్పుడు కూడా వీధుల్లో ఇలాంటి తోరణాలను కడతారు. ఈ పచ్చని తోరణాలు వీధులను అందంగా మార్చేస్తాయి.

వేప తోరణాలను జాతరలో కట్టడం ఒక భాగం. అలాగే ఇంట్లో ఎవరికైనా మశూచి వస్తే కూడా వేప ఆకుల తోరణాన్ని కడతారు. ఎందుకంటే ఈ వేప ఆకులు సాధారణంగా క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి.  మశూచిని నయం చేయడంలో వేప ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే దీన్ని గ్రామాల్లో ఇప్పటికీ నమ్ముతారు. 

పువ్వుల తోరణాలు

మామిడి, వేప తోరణాలతో పాటుగా డెకరేషన్ కోసం దేవాలయాల్లో, ఇంటి గుమ్మానికి పూల తోరణాలను కడతారు. చామంతి, గులాబీ, మల్లె వంటి అందమైన, మంచి వాసన వచ్చే పూలతో ఈ పూల తోరణాలను తయారుచేస్తారు. పిల్లల పుట్టినరోజు వేడుకల్లో, ఆడపిల్లల శుభకార్యాల్లో పువ్వుల తోరణాలను ఎక్కువగా వాడతారు.  

Latest Videos

click me!