మీ భాగస్వామిని సుఖపెట్టలేకపోతున్నారా..? కారణం ఇదే కావచ్చు..!

First Published | Apr 14, 2023, 12:19 PM IST

మీరు కలయికలో పాల్గొనాలని అడిగినప్పుడల్లా వారు ఏదో ఒక కారణంతో దూరం పెడుతున్నారంటే... దానికి కారణం ఉందనే అర్థం. మరి ఆ కారణాలేంటో ఓసారి చూద్దాం....

శృంగారం పై ఆసక్తి అందరికీ ఉంటుంది. కలయికను ఆస్వాదించాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే... మీకున్న ఆసక్తి మీ పార్ట్ నర్ కి ఉందో లేదో తెలుసుకుంటున్నారా? ఎందుకంటే... చాలా మంది తమ భాగస్వాములు కలయికను ఆస్వాదిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవడం లేదంట. తెలుసుకుంటే.. వారు ఎందుకు తమతో కలయికను ఆస్వాదించడంలేదో తెలుస్తుందట.

మీ భాగస్వామి మీతో సన్నిహితంగా ఉండటాన్ని ఇష్టపడటం లేదు అంటే...వారికి మీతో కలయిక ఇష్టం లేదని అర్థం. మీరు కలయికలో పాల్గొనాలని అడిగినప్పుడల్లా వారు ఏదో ఒక కారణంతో దూరం పెడుతున్నారంటే... దానికి కారణం ఉందనే అర్థం. మరి ఆ కారణాలేంటో ఓసారి చూద్దాం....

Latest Videos



ఉత్సాహం  లేకపోవడం
సెక్స్ సమయంలో మీ భాగస్వామి ఆసక్తి లేకుండా ఉన్నారంటే.. వారికి కలయికను ఆస్వాదించే ఉత్సాహం లేదని అర్థం.. వారు చురుగ్గా పాల్గొనడానికి ఇష్టపడకపోవచ్చు. మీరు బలవంత పెడితే.. అయిష్టంగా ఒప్పుకున్నా.. చాలాసార్లు వారు కలయికలో పాల్గొనకుండా ఉండటానికి సాకులు వెతుకుతూ ఉంటారు. 

కమ్యూనికేషన్ లేకపోవడం..
దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కలయిక విషయంలో ఎవరో ఒకరు అయిష్టత చూపిస్తారు. మీ భాగస్వామి వారి కోరికలు, ప్రాధాన్యతలు లేదా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనల గురించి బహిరంగంగా కమ్యూనికేట్ చేయకపోవచ్చు. వారు సెక్స్ గురించి చర్చించడం లేదా వారి భావాలను వ్యక్తం చేయడం మానుకోవచ్చు, ఇలా చెప్పకపోవడం కూడా దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది.

శారీరక అసౌకర్యం లేదా నొప్పి..

కలయిక సమయంలో నొప్పి కలగడం, శారీరక అసౌకర్యం ఉండటం వల్ల కూడా కొందరు భాగస్వామితో కలయికను ఆస్వాదించలేరట. కలయిక సమయంలో చాలా మందికి కండరాలు బిగుసుకుపోతాయట. దాంతో వారు కలయికను ఆస్వాదించలేరు. నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉంటే.. వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 
 

భావప్రాప్తి లేదు
కలయికలో పాల్గొన్న సమయంలో భావప్రాప్తి కలిగితే వచ్చే తృప్తి వేరు. కానీ.. కలయిక లో పాల్గొన్న ప్రతిసారీ కనీసం ఒక్కసారి కూడా భావప్రాప్తి కలగకుంటే.. వారికి మళ్లీ కలయికలో పాల్గొనాలనే ఆసక్తి రాదు. అలాంటివారు ఆ విషయం భాగస్వామితో చర్చించి.. దానికి తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం..
సెక్స్ అనేది శారీరక చర్య మాత్రమే కాదు, భావోద్వేగం కూడా. లైంగిక కార్యకలాపాల సమయంలో లేదా తర్వాత మీ భాగస్వామి మానసికంగా దూరం, డిస్‌కనెక్ట్ లేదా స్పందించనట్లు అనిపిస్తే, వారు మీతో మానసిక సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఆస్వాదించడం లేదని సూచించవచ్చు.

click me!