మీ బంధం శృంగారానికి మాత్రమే పరిమితమయ్యిందా?

First Published | Jun 30, 2021, 3:36 PM IST

మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా? మీది నిజమైన ప్రేమేనా? లేక కేవలం శారీరకవాంఛలు తీర్చుకోవడానికే కలిసి ఉంటున్నారా? మీ భాగస్వామి మీద మీకున్నది ఆకర్షణా? ప్రేమా? కామమా?.. 

మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా? మీది నిజమైన ప్రేమేనా? లేక కేవలం శారీరకవాంఛలు తీర్చుకోవడానికే కలిసి ఉంటున్నారా? మీ భాగస్వామి మీద మీకున్నది ఆకర్షణా? ప్రేమా? కామమా?..
undefined
మీ బంధంలో కొన్ని లక్షణాలు మీది ప్రేమా? కామమా? తెల్చేస్తుంది. అవేంటో చూడండి..
undefined

Latest Videos


ప్రేమలో ఉన్నప్పుడు మీ ప్రేమికులే మీ మంచి స్నేహితులు. మీ ఇద్దరి మధ్య మంచి అర్థవంతమైన సంభాషణ జరుగుతుంది. మీది ప్రేమ కాకుండా కేవలం ఆకర్షణ, కోరిక మాత్రమే అయితే మీ సంభాషణకు ఓ అర్థం ఉండదు. అదే మీ మధ్య ఉన్నది ప్రేమో, కామమో ఇట్టే పట్టిస్తుంది.
undefined
మీ ఫీలింగ్స్ ఏంటో మీరు పట్టించుకోరు. వాళ్ల ఫీలింగ్స్ తో సంబంధం ఉండదు. అంటే మీ కమ్యూనికేషన్ కేవలం సెక్స్ మాత్రమే. దాని గురించే మీరు ప్రేమ అని పేరుపెట్టుకున్నారు.
undefined
మీరిద్దరూ కలిపి గడిపిన క్షణాల గురించి తలుచుకున్న ప్రతీసారి బెడ్ రూంలో సాన్నిహిత్యం తప్ప వేరే ఏదీ గుర్తుకురాదు. వారితో చూసిన సినిమా కానీ, కలిసి లంచ్ చేయడం కానీ.. సరదాగా కబుర్లు చెప్పుకోవడం కానీ గుర్తు రావడం లేదంటే ఆలోచించాల్సిందే.
undefined
ప్రేమించుకున్నారు ఓకే.. కానీ మీ మధ్య ఎప్పుడూ పెళ్లీ, పిల్లల ప్రస్తావన రావడం లేదూ అంటే.. అది పూర్తిగా కామం మాత్రమే.
undefined
కేవలం సెక్స్ కోసం మాత్రమే డేట్ కి పరిమితం అవుతున్నట్లేతే.. అది కామం కిందికేవస్తుంది. డేటింగ్ అనేది ఇద్దరు వ్యక్తుల్ని మానసికంగా దగ్గరచేయడనికి ఉపయోగపడుతుంది. ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను సున్నితంగా చెప్పుకోవడానికి చక్కటి మార్గం.
undefined
ఒకరిపై ఒకరు భావోద్వేగ పరంగా ఆధారపడడం లేదూ అంటే మీ రిలేషన్ షిప్ ఫెయిల్యూర్ బాటలో ఉన్నట్టు లెక్క. మీ అనుబంధంలో ప్రేమ తగ్గిపోయిందని అర్థం.
undefined
ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి పెద్దగా ఇష్టం చూపించరు. ఎమోషనల్ డిస్టెన్స్ పాటిస్తారు. అంటే ఆ బంధం కామబంధమే తప్ప ప్రేమబంధం కాదని గుర్తుంచుకోవాలి.
undefined
ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇది మీ అనుబంధంలో లేని ప్రేమను, ఫిజికల్ అట్రాక్షన్ ను మాత్రమే చూపిస్తుంది.
undefined
ఇంటిమసీ అంటే కేవలం బెడ్ రూంలో ఇద్దరూ కలిసి శృంగార కార్యకలాపాల్లో మునిగితేలడంమాత్రమే అనుకుంటే అది లస్ట్ కిందికే వస్తుంది.
undefined
ఇంటిమసీ అంటే ఇద్దరూ ఒకరు సాన్నిధ్యంలో ఒకరు గడపడం. ఇష్టమైన విషయాలు చర్చించుకోవడం, లోతుగా సంభాషించుకోవడం.. ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడం... అది ప్రేమ.
undefined
click me!