శృంగారంలో తరచూ పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసే ఉంటుంది. కలయికలో పాల్గొనడం వల్ల లాభాలు ఉన్నాయి అనే విషయం తెలుసు కానీ..... కలయికకు దూరం కావడం వల్ల నష్టాలు ఉన్నాయి అనే విషయం తెలిసి ఉండకపోవచ్చు. శృంగారానికి ఎక్కువ కాలం దూరం కావడం వల్ల... అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...
1.కోరికలు తగ్గిపోతాయి...
కలయికలో ఒకరోజు పాల్గొనడం వల్ల... మరుసటి రోజు.. మళ్లీ కలయికలో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది. అదే విధంగా.. కలయికకు దూరం కావడం వల్ల కూడా...దానిపై కోరిక తగ్గిపోతుందట. దాదాపు 174 మంది పై చేసిన సర్వేలో ఈ విషయం నిరూపితమైందట. ఎక్కువ కాలం గ్యాప్ రావడం వల్ల... దాని మీద ఆసక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బలహీన రోగనిరోధక వ్యవస్థ
ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేయడం ద్వారా..రెగ్యులర్ సెక్స్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వ్యాధితో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే... తక్కువ సెక్స్ చేయడం వల్ల తరచుగా జలుబు , ఫ్లూకి దారితీసే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, రెగ్యులర్ సంభోగంలో పాల్గొనేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు తేలడం విశేషం.
ఒత్తిడి , రక్తపోటు స్థాయిలలో పెరుగుదల
మీరు సెక్స్ చేయకుండా.. వేరే విధంగా వ్యాయామం చేయకుంటే మీ రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు పెరగవచ్చు. ఇది మీ మానసిక స్థితిని తగ్గిస్తుంది. మీరు సెక్స్ చేయడం మానేయాలని నిర్ణయించుకుంటే.... కచ్చితంగా ఏవో ఒక వ్యాయామం చేయడం మొదలుపెట్టాలి. లేకపోతే... ఒత్తిడి పెరిగిపోయి... ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ప్రతి మనిషికి పెల్విక్ ఫ్లోర్ ఉంటుంది. కలయికకు దూరంగా ఉండటం వల్ల అది బలహీనపడవచ్చు. ఇది మీ సామర్థ్యం, తదుపరి భావప్రాప్తి తీవ్రత రెండింటిపై ప్రభావం చూపుతుంది.
యూరోపియన్ యూరాలజీలో ప్రచురించబడిన 2016 అధ్యయనం ప్రకారం.. స్ఖలనం ఫ్రీక్వెన్సీ, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదానికి మధ్య ప్రతికూల సహసంబంధాన్ని కనుగొంది. నెలకు 20 సార్లు స్ఖలనం చేసిన పురుషుల కంటే నెలకు ఏడు సార్లు కంటే తక్కువ తరచుగా స్ఖలనం చేసే ప్రోస్టేట్ వ్యాధి ఉన్న పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు ఎక్కువ ప్రమాదం ఉంది.