‘పుష్ప-2’ ప్రతీ నిముషం లెక్కే : రన్ టైమ్ తెచ్చిపెడుతుందా చిక్కు?

First Published | Nov 27, 2024, 7:11 AM IST

పుష్ప 2 చిత్రానికి 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. ఈ నిడివి ప్రేక్షకులను సీట్లో కుర్చోబెట్టడం కష్టమే అయినప్పటికీ, కథనం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రతి నిమిషం ఉత్కంఠ రేపుతుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Allu Arjun, #Pushpa2, sukumar


ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా పెద్ద  సినిమాలకు  రన్ టైమ్ ఎక్కువే ఉంటున్న సంగతి తెలిసిందే. కథ నడకను బేస్ చేసుకుని.. ఎక్కడ సీన్స్ కట్ చేసేందుకు వీలు లేకపోవడంతో మేకర్స్ రన్ టైమ్ లెంగ్త్  ఎక్కువే పెడుతున్నారు.

దీంతో కొన్నిసార్లు ఇది సమస్య గా కూడా మారుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉంటే.. ప్రేక్షకులకు కొన్నిసార్లు చిరాకు పడుతున్నారు. అయితే ప్రేక్షకుడు కథలో లీనమైతే.. మూడు గంటలు ఉన్నా.. అంతుకు పైన ఉన్నా సినిమాను అలానే చూస్తాడు. ఫైనల్ ఎడిటింగ్ అయిపోయాక.. కట్ చేసే వీలు లేకుంటే.. 3 గంటల సినిమాకి పైగా విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా పుష్ప 2 చిత్రానికి కూడా రన్ టైం ఎక్కువ వచ్చిందని సమాచారం. 
 


పుష్ప సినిమా భారీ రన్ టైం ను లాక్ చేసుకుందని సమాచారం. పుష్ప 2 సినిమాను ఏకంగా 3గంటల 15 నిమిషాల నిడివితో విడుదల చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో 3 గంటల సినిమా అంటేనే  రిస్క్ అని అంతా భావిస్తున్నారు.

అలాంటిది ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలంటే..  ఎలా ఉండబోతుందా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అంత సేపు ప్రేక్షకులను సీట్లో కుర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. 
 


Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


కానీ పుష్ప 2 లో ప్రతీ నిముషం తల తిప్పనివ్వని విధంగా ఉండబోతోందని టాక్. అదిరిపోయే యాక్షన్ సిక్వెన్స్ లు, స్క్రీన్ ప్లే , ఇంటర్వెల్ బ్యాంగ్ , కథ , కథనం అంతా చాలా ఎంగేజింగ్ గా సుకుమార్ రెడీ చేసారని, అదే ధైర్యంతో రన్ టైమ్ ని లాక్ చేసి వదులుతున్నట్లు వినిపిస్తోంది.  ఇక పుష్ప పార్ట్ 1.. 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది. పుష్ప 2 మీద ఎక్సపెక్టేషన్స్  బాగానే పెరిగాయి.  
 


మరో ప్రక్క పుష్ప 2 చిత్రం మెయిన్ టార్గెట్ నార్త్ ఇండియాగా మారింది. ఇప్పటికే నార్త్ లో మన సౌతిండియా సినిమాలు అదరకొడుతున్నాయి. కల్కి కలెక్షన్స్ తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2  పై పడింది. ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపిన సంగతి తెలసిందే.

బన్ని  కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. 
 

allu arjun movie Pushpa2 The Rule release on december 5th


ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంత రావచ్చు..మొదట రోజు ఓపినింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి.

మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి. టోటల్ గా ఎంత కలెక్ట్ చేయచ్చు అనే ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది మీడియా. ముఖ్యంగా కల్కి చిత్రం 400 కోట్లు వసూలు చేసిన నేపధ్యంలో పుష్ప 2కు ఇంకెంత కలక్షన్స్ రాబోతున్నాయనేది ఆసక్తికరమైన డిస్కషన్ గా మారింది. అలాగే అక్కడ ఈ లెంగ్తీ రన్ టైమ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. 
 

Latest Videos

click me!