23 హిట్స్ ఇచ్చిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి.. బహిరంగంగానే సెటైర్లు వేసిన స్టార్‌ డైరెక్టర్

First Published | Nov 27, 2024, 8:27 AM IST

చిరంజీవి తనకు 23 సినిమాలు చేసిన దర్శకుడినే అవమానించాడు. పార్టీలు మారినంత ఈజీగా సక్సెస్‌ ఇచ్చిన దర్శకుడిని మర్చిపోయాడా?
 

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఇప్పటి వరకు ఆయన 156 సినిమాలు చేశారు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా ఆయనే మెగాస్టార్. తర్వాతి తరం హీరోలు పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నా, చిరు స్థానం పదిలం, ఆయన స్థానాన్ని, స్థాయిని ఎవరూ టచ్‌ చేయలేరంటే అతిశయోక్తి కాదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇదిలా ఉంటే చిరంజీవి తనకు 23 సినిమాలు చేసిన దర్శకుడిని అవమానించాడు. 23 సినిమాల్లో 90శాతం సక్సెస్‌ రేట్‌ ఉండటం విశేషం. ఒక హీరో, దర్శకుడు 23 సినిమాల కాంబినేషన్‌ అంటూ అది మామూలు విషయం కాదు, ఒక హిస్టరి, ఒక రికార్డు. అయితే అలాంటి దర్శకుడినే చిరు అవమానించడం ఆశ్చర్యంగా మారింది. అయితే ఈ విషయంలో ఆ దర్శకుడే తన బాధని, ఆవేదనని వ్యక్తం చేశాడు.
 


ఆ దర్శకుడు ఎవరో కాదు, ఏ కోదండరామిరెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుల్లో ఒకరు. ఆ మధ్య చిరంజీవి తనకు బాగా పేరు తీసుకొచ్చిన దర్శకులు, విజయాలు ఇచ్చిన దర్శకులు, మీకు బాగా నచ్చిన దర్శకులు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన దర్శకుల గురించి చిరంజీవి మాట్లాడారు. ఆ దర్శకుల గురించి చెప్పారట. అయితే అందులో కోదండ రామిరెడ్డి పేరు లేదు. ఆయన పేరు చెప్పకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌ అయ్యింది. 23 సినిమాలు చేసి అనేక హిట్స్ ఇచ్చిన దర్శకుడి పేరునే చెప్పకపోవడం ఆశ్చర్యంగా మారింది. 
 

ఇదే ప్రశ్న ఆ దర్శకుడికి ఎదురయ్యింది. ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, చిరంజీవి తన పేరు ప్రస్తావించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను చాలా బాధపడినట్టు తెలిపారు. చాలా బ్యాడ్‌గా ఫీలయ్యాయనని వెల్లడించారు. 23 సినిమాలు చేశాను, అన్నీ హిట్స చిరంజీవి ఇలా చేస్తాడనుకోలేదని తెలిపారు. రాజకీయాలు, పార్టీలు మారినట్టుగానే ఇది కూడా మారిపోయిందా అని యాంకర్‌ అడగ్గా అదే జరిగిందేమో అంటూ ఆ దర్శకుడు కామెంట్‌ చేయడం విశేషం.

అయితే చిరంజీవి అది పొరపాటుని చేసిన పని. అంతేకాని ఎలాంటి విభేదాలు లేవు. ఈ విషయాన్ని తర్వాత మాట్లాడుకుని సెట్ చేసుకున్నారు. ఇప్పుడూ వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. మొన్న చిరంజీవికి గిన్నిస్‌ రికార్డు ఇచ్చే సందర్భంలో కోదండరామిరెడ్డి హాజరయ్యారు. అలాగే ఏఎన్నార్‌ జాతీయ అవార్డు సందర్భంలోనూ ఆయన ఉన్నారు. 
 

ఇక కోదండరామిరెడ్డి టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒకరిగా రాణించారు. అత్యధిక సినిమాలు చేసిన దర్శకుల్లోనూ ఒకరిగా నిలిచారు. ఈ విషయంలో దాసరి నారాయణరావు మొదటి స్థానంలో ఉండగా, కె రాఘవేంద్రరావుల రెండో స్థానం, కోదండరామిరెడ్డిది మూడో స్థానం అని చెప్పాలి. ఆయన తన కెరీర్‌లో 94 సినిమాలు చేశారు.

ఇందులో 70-80శాతం సక్సెస్‌లే. వీటిలో 23 సినిమాలు కేవలం చిరంజీవి ఒక్కరితోనే కావడం విశేషం. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీస్‌, సవాల్‌తో కూడిన చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్లు, సామాజిక అంశాలు మేళవించిన చిత్రాలు చేశారు. మెయిన్గా కంటెంట్‌ ఉన్న చిత్రాలతో మెప్పించారు. 
 

వీరి కాంబినేషన్‌లో `ఖైదీ`, `ఛాలెంజ్‌`, `విజేత, `న్యాయం కావాలి`, `కిరాయి రౌడీలు`, `ప్రేమ పిచ్చోళ్లు`, `అభిలాష`, `శివుడు శివుడు శివుడు`, `గూండా`, `రుస్తుం`, `దొంగ`, `రక్త సిందూరం`, `కిరాతకుడు`, `వేట`, `రాక్షసుడు`, `దొంగమొగుడు`, `పసివాడి ప్రాణం`, `జేబుదొంగ`, `మరణ మృదంగం`, `త్రినేత్రుడు`, `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు`, `కొండవీటి దొంగ`, `ముఠా మేస్త్రి` వంటి సినిమాలు చేశారు. వీటిలో 13 హిట్స్, 3 యావరేజ్‌గా ఆడాయి. ఏడు నిరాశ పరిచాయి. 

read more`బాషా` సినిమా చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్‌ అయ్యింది? అల్లు అరవింద్‌ దెబ్బేశాడా?

also read: పవన్‌ కళ్యాణ్‌ వదిలేసిన సినిమాతో హిట్‌ కొట్టి లవర్‌ బాయ్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Latest Videos

click me!