మహేష్ బాబుపై సల్మన్ ఖాన్ వైరల్ కామెంట్స్..! అసలు విషయం ఇదీ

First Published | Nov 27, 2024, 7:12 AM IST

సల్మాన్ ఖాన్, మహేష్ బాబుని నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అని ప్రశంసించారు. బిగ్ బాస్ 18లో ఈ ప్రశంసలు వ్యక్తం చేశారు. మహేష్ బాబు యొక్క స్క్రీన్ పర్సనాలిటీకి, ఆయన నిజ జీవితంలోని సరళమైన స్వభావానికి ఉన్న తేడాను సల్మాన్ ఖాన్  వివరించారు. ఈ వార్త పూర్తిగా చదవండి.

Mahesh Babu, Salman Khan, rajamouli


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుని ఆకాశానికి ఎత్తేశాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. మహేష్ నిజ‌మైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ పొగిడేశారు స‌ల్లూ భాయ్. బిగ్ బాస్ 18 లో మాజీ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్క‌ర్ హౌస్ మెట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆమె మ‌హేష్ భార్య న‌మ్ర‌త సోద‌రి. ఆమెతో మాట‌ల సంద‌ర్భంలో మ‌హేష్ గురించి అదిరిపోయే కామెంట్స్ చేశాడు హోస్ట్ సల్మాన్ ఖాన్. ఒక స్టార్ హీరోగా మ‌హేష్ ని.. నిజ జీవితంలో మ‌హేష్ ని పోల్చి స‌ల్మాన్ వివ‌రించిన తీరు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పుడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


సల్మాన్ ఖాన్ పనిగట్టుకుని మరీ  మహేష్ బాబు పేరును ఎందుకు ప్రస్తావించాడు అంటే... ఆయన హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కంటెస్టెంట్ గా పాల్గొనడమే రీజన్.

హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 ప్రసారమవుతుండగా, రీసెంట్ గా ఓ ఎపిసోడ్ లో శిల్పా శిరోద్కర్ తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ మహేష్ బాబు ప్రస్తావన తెచ్చారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ సల్మాన్ ఖాన్ 'మహేష్ బాబు సినిమాల్లో ఒకలా ఉంటారు... రియల్ లైఫ్ లో మరోలా ఉంటారు' అంటూ ఆమెతోపాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి క్లాస్ తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..."శిల్పా మీ బావ మహేష్ బాబు... స్క్రీన్ మీద యాక్షన్, ఆటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో కనిపిస్తారు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్. చాలా సింపుల్ గా ఉంటాడు" అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే ఇదంతా ఎందుకంటే... మహేష్ బాబును ఉదాహరణగా చూపి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి జీవిత పాఠాలు చెప్పారు సల్మాన్ ఖాన్. ఇక షోలో మహేష్ బాబు ప్రస్తావన రావడంతో ఆయన మరదలు శిల్పా సంతోషంతో చూస్తూ, సల్మాన్ ఖాన్ చెప్పే మాటలు వింటూ ఉండిపోయింది. 
 


ఇక స‌ల్మాన్ ప్ర‌శంస ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో  వేవ్స్ క్రియేట్ చేస్తోంది. సల్మాన్ మహేష్ బాబు సింప్లిసిటీని ప్రశంసించడం మహేష్ అభిమానులకు హార్ట్ టచింగ్ మూమెంట్ గా మారిందంటున్నారు. మహేష్ ఏంటో, మహేష్ రేంజ్ ఏంటో మరోసారి సల్మాన్ మాటలు ద్వారా రుజువు అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ కామెంట్స్ తో మహేష్ బాబు పేరు బాలీవుడ్ లో మరోసారి నానుతోంది. 
 

స‌ల్మాన్ ఖాన్ గతంలో మ‌హేష్ సూపర్ హిట్ పోకిరి మూవీని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మ‌హేష్ తో అప్ప‌టి నుంచే స‌ల్మాన్ కి మంచి రిలేషన్ ఉంది.

చాలా కాలంగా స‌ల్మాన్ – మ‌హేష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ కాంబినేషన్ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే మహేష్ మరో రెండేళ్ల దాకా రాజమౌళి చిత్రంలోనే బిజీగా ఉంటారనేది నిజం.

Latest Videos

click me!