Sexual Health:శృంగారానికి సింపుల్ వ్యాయామాలు ఇవే..!

First Published Nov 30, 2021, 4:32 PM IST

మీకు మెరుగైన సెక్స్ జీవితాన్ని అందించే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. మెరుగైన సెక్స్ జీవితం కోసం ఈ వ్యాయామాలు ప్రాక్టీస్ చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.

exercises

మనందరికీ ఏ పని చేయాలన్నా ఆరోగ్యకరమైన శరీరం కావాలి, సెక్స్ లైఫ్ ఆస్వాదించాలన్నా కూడా.. మనం ఆరోగ్యంగా ఉండాల్సిందే. శరీరం ఆరోగ్యంగా లేకపోతే.. మంచి సెక్స్ సాధ్యం కాదు.  మీకు మెరుగైన సెక్స్ జీవితాన్ని అందించే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. మెరుగైన సెక్స్ జీవితం కోసం ఈ వ్యాయామాలు ప్రాక్టీస్ చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.

స్క్వాట్స్..
శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే.. స్క్వాట్స్ చేయాలట. ప్రతి రోజూ స్క్వాట్స్ చేయడం వల్ల.. శరీరం ఆరోగ్యంగా మారుతుంది. తొడలు, హిప్స్, పిరుదుల కండరాలు బలంగా తయారౌతాయి. కాళ్లల్లో బలం పెరుగుతుంది. వీపు భాగం, ఉదర భాగం.. ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ స్క్వాట్స్ ఉపయోగపడతాయి.
 

కెగెల్ వ్యాయామాలు..

పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, లేదా కెగెల్ వ్యాయామాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని కూడా.. పరగడుపున అంటే.. ఉదయాన్నే చేయడం మచింది.  ఒక్కో వ్యాయామం పదిసార్లు రిపీట్ చేస్తూ.. చేయడం మంచిది. దీని వల్ల  హిప్ కింది భాగం కండరాలు బలంగా మారతాయి. ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి.

ఏరోబిక్ వ్యాయామాలు,
కార్డియో అని కూడా పిలుస్తారు, ఇవి సాపేక్షంగా తక్కువ-తీవ్రత కలిగిన శారీరక వ్యాయామాలు, ఇవి ప్రధానంగా ఏరోబిక్ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలపై ఆధారపడతాయి. ఇది లైంగిక శక్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయి.

ఏరోబిక్ అంటే 'ఉచిత ఆక్సిజన్‌ను కలిగి ఉండాలి' .ఏరోబిక్ జీవక్రియ ద్వారా వ్యాయామం చేసే సమయంలో శక్తి అవసరాలను తగినంతగా తీర్చడానికి ఆక్సిజన్‌ను ఉపయోగించడాన్ని సూచిస్తుంది.
 


గ్లూట్ కండరాల వ్యాయామం
గ్లూట్ కండరాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఈ గ్లూడ్ కండరాలు.. నాలుగు కండరాల సమూహం. ఈ మూడు కండరాలలో పిరుదులు, గ్లూటియస్ మాగ్జిమస్ కండరం, గ్లూటియస్ మీడియస్ కండరం ,గ్లూటియస్ మినిమస్ కండరాలు ఉన్నాయి. కండరాలలో నాల్గవ , చిన్నది టెన్సర్ ఫాసియా లాట్ కండరం. ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 

యోగా 
చివరగా, మీ శరీరం సెక్స్‌లో పాల్గొనడానికి యోగా ఒక గొప్ప వ్యాయామం. యోగా వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం, చైతన్యం వస్తుంది. అదనంగా, ఇది లైంగికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం మర్చిపోవద్దు

click me!