Relationship: దేశంలో వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో సంబంధాల తీరు మారుతోందని వెల్లడైంది. ప్రముఖ ఎక్స్‌ట్రామారిటల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Infidelity Study 2025లో గ్లీడెన్ అధ్యయనం ప్రకారం, దేశంలో వివాహేతర సంబంధాల కోసం ఎక్కువ మంది యాప్‌ను ఉపయోగిస్తున్న నగరంగా బెంగళూరు నిలిచింది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది బెంగళూరుకు చెందినవారే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. 12 నగరాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల 1,510 మందిపై ఈ సర్వే నిర్వహించారు.
25
హైదరాబాద్‌కు రెండో స్థానం.. టాప్ నగరాల జాబితా ఇదే
ఈ అధ్యయనంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం యాప్ వినియోగదారుల్లో 17 శాతం మంది హైదరాబాద్‌కు చెందినవారని వెల్లడైంది. ఆ తర్వాత ఢిల్లీ 11 శాతం, ముంబై 9 శాతం, పుణే 7 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. యాప్ వినియోగదారుల్లో 65 శాతం మంది పురుషులు కాగా, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.
35
ఈ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి.?
గ్లీడెన్ ప్రతినిధుల ప్రకారం, చాలా మంది కేవలం శారీరక సంబంధాల కోసం కాకుండా భావోద్వేగ పరమైన అనుబంధం కోసం ఈ తరహా ప్లాట్ ఫామ్స్ ఆశ్రయిస్తున్నారు. దాంపత్య జీవితంలో భావోద్వేగ లోటు, భాగస్వామితో సరైన అనుబంధం లేకపోవడం, ఒంటరితనం వంటి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగ స్థలాలు, సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు కొత్త పరిచయాలకు ప్లాట్ ఫామ్ గా మారుతున్నాయని పేర్కొంది.
ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. గత రెండు సంవత్సరాల్లో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరిగినట్లు గ్లీడెన్ పేర్కొంది. ఇది పట్టణ ప్రాంతాల్లో సంబంధాలపై మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళలు కూడా ఈ ప్లాట్ ఫామ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడైంది.
55
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహేతర సంబంధాల వెనుక ప్రధాన కారణం ఒంటరితనం, భావోద్వేగ శూన్యత. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన మద్ధతు లేదా అర్థం చేసుకోవడం లభించకపోతే కొందరు ఇతర సంబంధాల వైపు ఆకర్షితులవుతారని చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం, భారతీయ వినియోగదారులు రోజుకు సగటున ఒకటి నుంచి గంటన్నర వరకు ఈ తరహా యాప్‌లలో గడుపుతున్నారు. ఇదే సమయంలో మరో అంతర్జాతీయ డేటింగ్ యాప్ నిర్వహించిన అధ్యయనంలో తమిళనాడులోని కాంచీపురం కూడా వివాహేతర సంబంధాల హాట్‌స్పాట్‌గా నిలిచినట్లు వెల్లడైంది.
గమనిక: ఈ వివరాలు సంబంధిత యాప్‌లు నిర్వహించిన సర్వేలు, అధ్యయనాల ఆధారంగా వెల్లించడమైంది. ఇవి మొత్తం సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తాయని భావించకూడదు.