Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!

Published : May 18, 2026, 05:36 PM IST

Hyderabad Romance Roads : హైదరాబాద్ లో కొన్ని రోడ్లు రొమాన్స్ రోడ్లుగా మారిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఏరియాలు ప్రేమికుల అడ్డాలు అయిపోయాయి. అలాంటి రోడ్లు ఏవో తెలుసా..?

PREV
15
రోడ్లపైనే రొమాన్స్..

Hyderabad : కాలం మారుతోంది... దీనికి తగ్గట్లుగానే మనుషులు మారుతున్నారు. ఇది నిజమే.. కానీ లేటెస్ట్ కల్చర్ పేరులో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తోంది నేటి యువతరం. నాలుగు గోడల మధ్య పంచుకోవాల్సిన ప్రేమానుబంధాలను నడిరోడ్డుపైకి తీసుకువస్తున్నారు... అందరూ చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ వంటి కాస్మొపాలిటిన్ సిటీలో అదీ ఐటీ ఏరియాల్లో అమ్మాయిలు, అబ్బాయిల విచ్చలవిడితనానికి హద్దే లేకుండా పోతోంది. రోడ్లపైనే, నలుగురూ చూస్తుండగానే రొమాన్స్ లో మునిగిపోయే సంస్కృతి పెరిగిపోయింది... ఇలా ప్రేమికుల రాసలీలలకు అడ్డాలుగా మారి ఫ్రేమస్ అయిన ప్రాంతాలు కొన్ని నగరంలో ఉన్నాయి.

25
ఐసిఐసిఐ బిల్డింగ్ రోడ్డు...

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ బిల్డింగ్ రోడ్డు ఇప్పుడు లవర్స్ కి అడ్డాగా మారిపోయింది. సాయంత్రం అయ్యిందంటే చాలు చుట్టపక్కల హాస్టల్స్, పిజి, రూంలలో ఉండే యువత ఇక్కడికి చేరుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒక్కచోటికి చేరి రోడ్డునే ఓయో రూంలుగా మార్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు వందల్లో జంటలు రొమాన్సులో మునిగిపోతుంటారు.. దీంతో పెద్దవాళ్లు అటువైపు వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు.. తప్పనిసరై వెళ్లినా తల కిందకు వేసుకోవాల్సిందే.

35
కేబుల్ బ్రిడ్జి

ఐటీ ఏరియాలోని దుర్గం చెరువుపై పర్యాటక ఆకర్షణ కోసం కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది ప్రభుత్వం. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు సమీపంలోని ఈ బ్రిడ్జి కేవలం పర్యాటకులనే కాదు ప్రేమికులకు ఆకట్టుకుంటోంది. ఇంకేముంది సాయంత్రం అయ్యిందంటే చాలు జంటలు జంటలుగా ఈ కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుంటున్న జంటలు కాస్త వెలుతురు తగ్గితే రొమాన్స్ ప్రారంభం అవుతుంది. బర్త్ డే లు, ఇతర సంబరాలకు కూడా అడ్డాగా మారింది ఈ కేబుల్ బ్రిడ్జి.

45
ఖాజాగూడ మల్కం చెరువు రోడ్డు...

హైదరాబాద్ లో ప్రేమికులకు అడ్డాగా నిలిచే మరో ప్రాంతం రాయదుర్గం మల్కం చెరువు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు పత్తి యాపారాలకు నిలయంగా మారింది. ఖాజాగూడ సమీపంలో రాత్రి అయ్యిందంటే చాలు రోడ్లపైనే భర్త్ డే వేడుకలు, సంబరాలు... మామూలు సందడి ఉండదు. పనిలోపనిగా కొందరు రోడ్డుపైనే రొమాంటిక్ సినిమా షురూ చేస్తారు.

55
హైటెక్ సిటీ...

ఐటీ ఎంప్లాయిస్ అడ్డా ఈ హెటెక్ సిటీ. అయితే ఈ ప్రాంతంలో పగలంతా సాప్ట్ వేర్ హడావిడి...రాత్రయితే హార్డ్ వేర్ అంటే ప్రేమజంటల హడావిడి ఉంటుంది. ముఖ్యంగా టీ హబ్ సమీపంలో నీలోఫర్ కేఫ్ దగ్గర యువతీయువకుల హంగామా మామూలుగా ఉండదు... బైక్ రేసులు, రీల్స్, డ్యాన్సులతో సందడి సందడిగా ఉంటుంది. కొన్నిచోట్లు ప్రేమికులు బహిరంగ రొమాన్స్ కూడా సాగుతుంది.

ఇలా నగరంలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో పగలు సాప్ట్ వేర్... రాత్రయితే హార్డ్ వేర్ సాగుతోంది. ఇక పబ్బులు, కొన్ని రెస్టారెంట్స్ వద్ద ఇదే పరిస్థితి ఉంటోంది. ఇక వీకెండ్ లో పార్కుల వద్ద పరిస్ధితి మరీ దారుణం.. రోడ్లపైనే సంసారం పెడుతున్నారు. ఇలా రోడ్లపైనే యువతీయువకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా పోలీసులు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఫ్యామిలీతో వెళ్లేవారు ఇబ్బందిపడాల్సి వస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories