Relationship: కొత్తగా పెళ్లైందా? ఈ ఆరు డ్రింకులు తాగాల్సిందే..!

Published : May 05, 2025, 10:28 AM IST

జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా శరీరక ఆరోగ్యం, సంబంధాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. 

PREV
18
Relationship: కొత్తగా పెళ్లైందా? ఈ ఆరు డ్రింకులు తాగాల్సిందే..!
Couple


పెళ్లి అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు చాలా కలలు ఉంటాయి. పెళ్లి తర్వాత తాము కోరుకున్నట్లు జీవితం లేకపోతే నిరుత్సాహం ఫీలౌతారు. ముఖ్యంగా లైంగిక జీవితం సంతోషాన్ని ఇవ్వకపోతే  ఎవరికైనా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం లేదు.దీని వల్ల పడకగదిలో కూడా ఎక్కువగా సంతోషం పొందలేకపోతున్నారు. మరి, అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

28
Couple

జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా శరీరక ఆరోగ్యం, సంబంధాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఈ క్రమంలో మీరు మీ వైవాహిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెగ్యులర్ గా కొన్ని డ్రింక్స్ తాగితే చాలు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులకు ఈ డ్రింక్స్ తో అవసరం చాలా ఉంటుంది. ఈ డ్రింక్స్ తాగడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే చాలు. ముఖ్యంగా తాగాల్సిన డ్రింక్స్ ఏంటో చూద్దాం...


 

38

దానిమ్మకాయ జ్యూస్...

దానిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది పురుషులు, స్త్రీలలో లైంగిక కోరికను పెంచడంలో సహాయపడుతుంది. దానికి సహాయపడే టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
 

48

అరటి పండు మిల్క్ షేక్...

అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి. మీరు తేనె, పాలతో స్మూతీని తయారు చేస్తే, లైంగిక కోరికను పెంచడానికి సహాయపడుతుంది.


 

58

అల్లం టీ:

అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ, మీ భాగస్వామి  శక్తిని పెంచడానికి  లైంగిక ఆకర్షణను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

68


వాటర్ మిలన్ జ్యూస్..

పుచ్చకాయలో సిట్రుల్లైన్ అనే సహజ పదార్ధం ఉంటుంది, ఇది రక్త నాళాలను కొంతవరకు సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వయాగ్రా లాంటి ప్రభావాలను కలిగి ఉంటుంది.
 

78

రెడ్ వైన్:

మితమైన మొత్తంలో రెడ్ వైన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా లైంగిక కోరికను పెంచుతుంది. అయితే, ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం గుర్తుంచుకోండి.
 

88


బాదం పాలు:

బాదంలో జింక్, సెలీనియం,  విటమిన్ E ఉంటాయి, ఇవి లైంగిక ఆరోగ్యానికి ముఖ్యమైనవి. వాటిని పాలతో కలిపితే మీ లైంగిక కోరికను పెంచే పోషకమైన పానీయంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories