కొత్త సెక్స్ పొజిషన్ .... పురుషాంగం డ్యామేజ్..!

First Published | Apr 29, 2023, 1:36 PM IST

ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్ కారణంగా ఇండోనేషియాలో ఓ  వ్యక్తి  పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యింది.  దీంతో.. అతనికి  అత్యవసర శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. 

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అందులోనూ భిన్నంగా ఆస్వాదించాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో చాలా మంది ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. 

penis

తాజాగా ఓ వ్యక్తి డిఫెరెంట్ పొజిషన్ లో సెక్స్ ని ఆస్వాదించాలని ప్రయత్నించి తన పురుషాంగాన్ని డ్యామేజ్ చేసుకున్నాడు.  ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Latest Videos


penis

ఒక ప్రముఖమైన ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్ కారణంగా ఇండోనేషియాలో ఓ  వ్యక్తి  పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యింది.  దీంతో.. అతనికి  అత్యవసర శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అతని పురుషాంగం పూర్తిగా నలిగిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
యూరాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్ ఇటీవలి సమాచారాన్ని వివరిస్తూ ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది.

penis

ఆ వ్యక్తి తన భాగస్వామితో సెక్స్ చేస్తున్నప్పుడు అతని పురుషాంగం నలిగిపోయింది. దీంతో ఆ నొప్పిని భరించలేక వెంటే ఆస్పత్రికి పరుగులు తీశాడు.అతని వయసు 37 సంవత్సరాలు కాగా, అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. అంత ప్రమాదానికి గురి చేసిన సెక్స్ పొజిషన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అది  "రివర్స్ కౌగర్ల్" . ఈ  పొజిషన్‌లో సెక్స్ చేశాడు. ఈ పొజిషన్ లో స్త్రీ పైన, పురుషుడు కింద ఉంటాడు. ఈ పొజిషన్ లో వారు కలయికలో పాల్గొన్న సమయంలో తప్పిదం జరిగి, తన పురుషాంగాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాడు. పెద్దగా ఏదో విరిగిపోయినట్లుగా శబ్దం రావడం, అంగస్తంభనకు గురికావడం, భరించలేని నొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు.

PENIS

పురుషాంగం ఉబ్బి, రంగు కూడా మారిపోయిందట. వైద్యుల పరీక్షలో అతని పురుషాంగంలోని ఎముకలు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. నిజానికి పురుషాంగానికి ఎముకలు ఉండవు. కానీ అది నిటారుగా నిలపడటానికి ఒక కణజాలం ఉంటుంది. అది చిరిగిపోయినప్పుడు ఈ ఫ్యాక్చర్ అవుతుందని వైద్యులు తెలిపారు. 
 

click me!