తొలి ముద్దు చిరస్మరణీయం కదా. ఇది ఎప్పుడు గుర్తొచ్చినా మీలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఇలాంటి ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నిజానికి ముద్దు రెండు పెదాల కలయికే కాదు.. అంతకు మించి.. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంంది. ఇది సెక్స్ కంటే తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty Images
ముద్దు గురించి ఆలోచించినప్పుడు.. ఇది ఎన్నో భావోద్వేగాలను సృష్టిస్తుంది. అది ప్రేమ, సంరక్షణ, సాన్నిహిత్యం వంటివి మరెన్నో కావచ్చు. ఇది చాలా త్వరగా జరగొచ్చు లేదా గంటల పాటు కొనసాగొచ్చు. కానీ ముద్దు మీలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని మాయం చేస్తుంది. సరికొత్త భావాన్ని పుట్టిస్తుంది.
జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీలో ఒక అధ్యయనం.. ముద్దు మన లైంగిక, సంబంధాల అనుభవాలతో ఎలా ముడిపడి ఉందో చూపిస్తోంది. ఈ పరిశోధనలో మొత్తం 878 మంది పాల్గొన్నారు. వీరిలో 433 మంది పురుషులు, 445 మంది మహిళలు ఉన్నారు. కనీసం ఆరు నెలల పాటు రిలేషన్షిప్ లో ఉన్నట్లు రిపోర్టు చేసిన వారిని సెక్స్ సమయంలో పెదవులపై ఎంత తరచుగా ముద్దు పెట్టుకున్నారని అడిగారు. రెండోది.. వారు సెక్స్ చేయనప్పుడు వారి భాగస్వామిని ఎంత తరచుగా ముద్దు పెట్టుకున్నారు. తర్వాత పాల్గొన్న వారు తమ భాగస్వామితో ఎంత తరచుగా సెక్స్ చేశారు?సెక్స్ సమయంలో వారు ఎంత తరచుగా ఉద్వేగానికి గురయ్యారో పంచుకున్నారు. చివరగా వారి సంబంధంలో సెక్స్ పట్ల సంతృప్తి చెందారా? వారి సంబంధంలో వారు ఎంత సంతృప్తి చెందారు అని కూడా అడిగారు.
అయితే సెక్స్ సమయంలో ముద్దు పెట్టుకోవడం స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక ఫ్రీక్వెన్సీతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందని తేలింది. రతిక్రీడ సమయంలో ఎక్కువగా ముద్దులు పెట్టుకునే వారు ముద్దు పెట్టుకోని వారి కంటే తమ భాగస్వామితో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారని తేలింది. అంతే కాదు ఇలా ముద్దులు పెట్టుకున్న మహిళల్లో సెక్స్ సమయంలో ఎక్కువ భావప్రాప్తి కలుగుతుందట. మొత్తంమీద మహిళలకు ముద్దు వారి లైంగిక అనుభవాలను, నాణ్యతను మెరుగుపరుస్తుందని దీని అర్థం.
ముద్దు భావప్రాప్తిని ఎలా మెరుగుపరుస్తుంది?
మహిళలను ముద్దు పెట్టుకోవడం సెక్స్ సమయంలో మరింత భావోద్వేగ సాన్నిహిత్యాన్ని సూచిస్తుందట. ఇది ఆమెను మరింత ప్రేరేపిస్తుందని అధ్యయనం పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు ఇది తక్కువ వేగాన్ని కూడా సూచిస్తుంది. అంటే వీరు ఫోర్ ప్లే లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ ఫోర్ల ప్లే ఆడవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ప్రజలు తమ సంబంధంలో ఎంత సంతృప్తిగా ఉంటే, వారు తమ భాగస్వామిని ముద్దు పెట్టుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన విషయాలు
సెక్స్ విషయంలో మహిళల కంటే పురుషులు ఎక్కువ చురుకుగా ఉంటారని అందరికీ తెలసిందే. ఎందుకంటే వారికే సెక్స్ గురించి ఎక్కువ తెలుసు. స్త్రీపురుషుల మధ్య భావప్రాప్తి అంతరం ఉంటుంది. అలాగే సెక్స్ సమయంలో ముద్దు ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల మహిళలకు లైంగిక ఫ్రీక్వెన్సీ, మొత్తం సంతృప్తి పెరుగుతుందట. మంచి రిలేషన్ షిప్ కు ముద్దు చాలా ముఖ్యం.