ఆడవాళ్లకు సెక్స్ కోరికలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో తెలుసా?

First Published Mar 13, 2024, 3:45 PM IST

మగవారు, ఆడవారిలో లైంగిక కోరికలు కలగడం చాలా కామన్. కానీ ఆడవారిలో కొన్ని సందర్భంలో లైంగిక వాంఛ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎప్పుడెప్పుడంటే? 
 

Boring Sex Life

ఆడవారిలో లైంగిక వాంఛ బాగా తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే వీరిలో లైంగిక కోరికలు బాగా పెరగడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ లైంగిక జీవితం స్త్రీ పురుషులిద్దరికీ మంచి మేలు చేస్తుంది. అసలు ఆడవారిలో లైంగిక కోరికలు ఎప్పుడు పెరుగుతాయో తెలుసా? 
 

Sex Life

హార్మోన్ల స్థాయిలలో మార్పులు

సెక్స్ హార్మోన్లైన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ స్థాయిలలో మార్పులు సెక్స్ డ్రైవ్ లో తేడాలకు కారణమవుతాయి. ఆడవాళ్లలో అండోత్సర్గము సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దీనివల్ల సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుంది. అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల లిబిడో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో, ఆ తర్వాత సెక్స్ కోరికలు పీక్స్ లో ఉంటాయి.
 

యుక్తవయస్సు

వృద్ధ మహిళల కంటే యువతుల్లోనే సెక్స్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధ్య వయస్కులైన ఆడవారిలో కూడా లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 27 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు లైంగిక కార్యకలాపాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే వీల్లు మంచి లైంగిక ఫాంటసీలు, చురుకైన లైంగిక జీవితాలను కలిగి ఉంటారు. అలాగే యుక్తవయస్సు బాలికల్లో అండోత్సర్గము ప్రారంభమవుతుంది. దీనివల్ల వీరికి కూడా లైంగిక వాంఛ ఎక్కువగా ఉంటుంది. 
 

ఎక్కువ వ్యాయామం

ఆడవాళ్లు వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు శారీరకంగా మరింత చురుగ్గా ఉంటారు. ఇది వారి శారీరక దృఢత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ సమయంలో సెక్స్ డ్రైవ్ కూడా బాగా పెరుగుతుంది. 
 

Image: Getty

ఆరోగ్యకరమైన లైంగిక సంబంధం

హెల్తీ సెక్స్ లైఫ్ వల్ల కూడా ఆడవారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయి. దీనివల్ల మహిళల్లో లిబిడో బాగా పెరుగుతుంది. ఎవరైతే మంచి రిలేషన్ షిప్ లో ఉంటారో వారి సెక్స్ లైఫ్ సాఫీగా సాగుతుంది. అలాగే వీళ్లు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనాలనుకుంటారు.అదే భార్యాభర్తల మధ్య బంధం సరిగ్గా లేకుంటే ఆడవారిలో సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి. 

click me!