మామూలుగా భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తే రెండు మూడు రోజుల్లో అవే మెల్లగా సర్దుకుంటాయి. అలా కాదని ఈ గొడవల్ని మూడవ వ్యక్తి దగ్గరికి తీసుకు వెళ్లారంటే మీ బంధాన్ని మీరే చేజేతులా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి మీ సమస్యని మూడో మనిషి వరకు తీసుకు వెళ్ళకండి.
వీలైనంతవరకు మీరే పరిష్కరించుకోండి అందుకోసం ఈ చిట్కాలు పాటించండి. మీ భాగస్వామిపై ఎవరి దగ్గరా ఫిర్యాదులు చేయకండి. దానివల్ల మీపై చెడు అభిప్రాయం కలుగుతుంది. పైగా వారు కూడా మీలాగే ప్రవర్తించే మీ మీద ఫిర్యాదులు చేయడం ప్రారంభిస్తే సమస్య మరింత అవుతుంది.
అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. అలా కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు మీ భాగస్వామి గురించి చులకనగా మాట్లాడితే అది మీ భాగస్వామి మనసుని విరిచేయవచ్చు. ప్రకాకుండా విషయం చిన్నదైనా నలుగురు మధ్యలో భాగస్వామిని ప్రశంసించడం వల్ల బంధం మరికాస్త పటిష్టమవుతుంది.
ఒక్కొక్కసారి భర్తని సపోర్ట్ చేయలేని సందర్భం రావొచ్చు అలాంటప్పుడు పక్కనే ఉండి మాట్లాడ లేకపోతే దూరంగా వెళ్లి ఫోన్ చేసి మాట్లాడండి. విషయం అర్థమయ్యేలాగా మీ భాగస్వామికి చెప్పండి. ఇలాంటి అవగాహన భార్యాభర్తలకి ఎంతో అవసరం.
అలాగే మీ భాగస్వామిని మరెవరితోని పోల్చకండి అది అవతలి వ్యక్తులని చిన్నబుచ్చుకునేలాగా చేస్తుంది. మీ భాగస్వామి వలన మీకు ఏదైనా సమస్య అనిపిస్తే సమయం చూసుకొని వారితోనే చర్చించండి. మీ సమస్య అతనికి అర్థమైతే అతనే ఆ తప్పుని సరిదిద్దుకుంటాడు.
అంతేకానీ మూడో వ్యక్తికి చెప్పటం వలన సమస్య పరిష్కారం అవ్వదు సరి కదా ఆ మూడో వ్యక్తి సరి అయిన వాడు కాకపోతే మీ బంధాన్ని మరి కొంచెం దూరం చేస్తాడు. ఇద్దరి మధ్యన ఉండవలసిన సమస్యని పదిమందిలో పెట్టి మిమ్మల్ని నవ్వులపాలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి.