సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటే మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 5, 2023, 9:50 AM IST

నిజానికి సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది అందరికీ తెలుసు. కానీ మరీ ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే  ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. 
 

భార్యభర్తల మధ్య లైంగిక సంబంధం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇదే వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ప్రేమను, నమ్మకాన్ని పెంచుతుంది. అంతకు మించి వీరి ఇద్దరి ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే సెక్స్ లో తక్కువ సమయంలో కొంత మంది తృప్తి చెందుతుంటే, మరికొందరు మాత్రం సెక్స్ ను ఎప్పుడూ కోరుకుంటారు. కానీ సెక్స్ లో మరీ ఎక్కువగా పాల్గొంటే ఆడవారికి లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

అయితే మీరు, మీ భాగస్వామి ఇద్దరూ సంతోషంగా, సౌకర్యవంతంగా ఉన్నంత కాలం మీ మధ్య ఎక్కువ సెక్స్ అనేదే ఉండదు. సెక్స్ ఎంత ఎక్కువ లేదా తక్కువ అనేదానికి పరిమితి లేదు. కానీ దీనిలో ఎక్కువగా పాల్గొనడం వల్ల కొన్ని శారీరక సమస్యలు వస్తాయి. ఇవి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


యోని పొడి

మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటున్నారు అనడానికి ఇది మొదటి స్పష్టమైన సంకేతం. యోని పొడిబారడానికి మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనడమే కారణమంటున్నారు నిపుణులు. దీనివల్ల మీకు అక్కడ నొప్పి కలుగుతుంది. అసౌకర్యంగా కూడా ఉంటుంది. 
 

వాపు, నొప్పి

సెక్స్ లో పాల్గొనడం వల్ల జననేంద్రియాలలో నొప్పి, వాపు వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య శృంగారంలో ఎక్కువగా పాల్గొనే మహిళలకే తరచుగా వస్తుంది.  అంతేకాదు దీనివల్ల యోని పై చర్మం కూడా ఊడిపోవచ్చు. యోని నొప్పి,  వాపు కారణంగా మూత్ర విసర్జన చేసేటప్పుడు చికాకు లేదా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య రావొద్దంటే తరుచుగా సెక్స్ లో పాల్గొనడం మానేయండి. అలాగే కఠినమైన సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయకూడదు.

నిర్జలీకరణం

సెక్స్ సమయంలో చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే  మీరు లైంగికంగా చాలా చురుగ్గా ఉంటే .. ఎక్కువ చెమట పట్టడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అదంత హానికరమేమీ కాదు. కాబట్టి శృంగారానికి ముందు, తర్వాత నీటిని పుష్కలంగా తాగండి.
 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)

మూత్రాశయం ద్వారా బ్యాక్టీరియా మూత్ర మార్గంలోకి ప్రవేశించినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. లైంగికంగా చురుగ్గా ఉండే మహిళలకు ఈ యూటీఐ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగున్నవారికి కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వేర్వేరు భాగస్వాములతో ఎక్కువ సెక్స్ చేయడం వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 
 

వెన్నునొప్పి

సెక్స్  లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వెన్నునొప్పి కూడా వస్తుంది. ముఖ్యంగా నడుము కింది భాగంలో. తక్కువ వెన్నునొప్పి స్నాయువు వల్ల వస్తుంది. ఆకస్మిక కదలికల సమయంలో ఇది జరుగుతుంది. ఇది సెక్స్ సమయంలో దిగువ వీపుపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది.
 

click me!