‘టూ మచ్ సెక్స్’ అని ఎప్పుడంటారంటే?

First Published Jan 13, 2024, 2:22 PM IST

ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగం.  ఇది స్త్రీ, పురుషుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కానీ మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటే ఏమౌతుందో తెలుసా? 

సెక్స్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.  మన ఉనికి ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం. భార్యాభర్తల మధ్య లైంగిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నప్పుడే వారి బంధం అన్ని విధాలా బాగుంటుంది. అయితే సెక్స్ కూడా భార్యాభర్తల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. కానీ మీరు సెక్స్ లో ఎక్కువగా పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుంది. ఇది మీ శరీరం, మనస్సుపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అన్న సంగతిని ఎప్పుడైనా తెలుసుకున్నారా? 
 

Sex Life

కిన్సే ఇన్స్టిట్యూట్ అనేది లైంగికత, సంబంధాలు, శ్రేయస్సును అన్వేషించే పరిశోధనా సంస్థ. కిన్సే ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 18, 29 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు సంవత్సరానికి సగటున 112 సార్లు సెక్స్ లో పాల్గొంటారు. 30-39 ఏళ్ల వారిలో ఈ సంఖ్య ఏడాదికి 86గా ఉంది. అలాగే 40-49 ఏళ్ల మధ్య వయస్కులకు ఇది 69 గా ఉంది. ఇది జనాల వయసును బట్టి మారుతుంది. 
 

టూ మచ్ సెక్స్ అనేది లేనే లేదని నిపుణులు అంటున్నారు. కానీ ఆడవారు తమ శరీరం గురించి తెలుసుకోవాలి. అంటే మీకు చాలా నొప్పి, అలసటగా ఉంటే మాత్రం సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది. ఇదే మీకు మీరు సెక్స్ లో పాల్గొనా? వద్దా? అనేది చెప్తుంది. 
 

వారానికి ఒకటి లేదా రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ కొంతమంది సెక్స్ కు బానిక కావొచ్చు. కానీ టూ మచ్ సెక్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

Image: Getty

సెక్స్, మీ లైంగిక అలవాట్ల ఆలోచన మీ రోజువారీ జీవితం, సంబంధాలు, మీ దినచర్యలకు అంతరాయం కలిగిస్తున్నట్టైతే దాన్ని టూ మచ్ సెక్స్ అంటారు. అందుకే మీకు కూడా ఇలా ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.  

అయినా దీనిపై మీకు ఇంకా గందరగోళంగా ఉంటే.. మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి.. నిజంగా మీకు ప్రొఫెషనల్ సహాయం అవసరమా అని నిర్ణయించడంలో మీకు ఇవి సహాయపడుతాయి.

నేను నా సెక్స్ కోరికలను కంట్రోల్ చేసుకోగలనా?
నా లైంగిక ప్రవర్తనతో నాకు ఇబ్బందిగా ఉందా?
నా లైంగిక ప్రవర్తన నా సంబంధాన్ని దెబ్బతీస్తుందా? 
అది నా పనిపై ప్రభావం చూపుతోందా? 
చెడుగా ఆలోచిస్తున్నానా? 
నా లైంగిక ప్రవర్తనకు ఎవరైనా పట్టుబడతారని నేను భయపడుతున్నానా?

click me!