మహేష్ బాబు సెంటిమెంట్, వద్దు బాబోయ్ అంటున్న నితిన్.. ముందుంది అసలైన గండం

First Published | Nov 28, 2024, 12:35 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 మానియా వల్ల రాబిన్ హుడ్ ప్రచార కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు. 

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 మానియా వల్ల రాబిన్ హుడ్ ప్రచార కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు. రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ కూడా అది పుష్ప 2 ప్రెస్ మీటా లేక రాబిన్ హుడ్ మీటా అనే అనుమానం కలిగేలా సాగింది. 

పుష్ప 2 చిత్రానికి నిర్మిస్తున్న మైత్రి సంస్థలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. అందులో ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల ఇక్కడ హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతోంది. రాబిన్ హుడ్ చిత్రాన్ని 20 రోజుల తర్వాత రిలీజ్ చేయనున్నారు. దీనితో మీడియా ప్రతినిధులు వరుసగా పుష్ప 2 గురించే ప్రశ్నలు అడిగారు. 


పుష్ప 2 హంగామాలో రాబిన్ హుడ్ చిత్ర రిజల్ట్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ నితిన్ కి, డైరెక్టర్ వెంకీ కుడుములకి ఉంది. ఇక టాలీవుడ్ లో సెంటిమెంట్స్ గోల కూడా ఎక్కువగా ఉంటుంది. రాబిన్ హుడ్ ని ప్రస్తుతం ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. అది కూడా శ్రీలీల రూపంలోనే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

ఈ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆమెని తప్పించి శ్రీలీలని తీసుకున్నారు. శ్రీలీల డ్యాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. రాబిన్ హుడ్ విషయంలో కూడా అంతే.. ముందుగా రష్మికని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. షూటింగ్ మొదలవుతున్న సమయంలో ఆమె తప్పుకుంది. దీనితో ఇక్కడ కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. 

రష్మిక డేట్లు అడ్జెస్ట్ కాలేదని అందువల్లే శ్రీలీలని తీసుకున్నట్లు డైరెక్టర్ వెంకీ కుడుముల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరు కారం తరహాలోనే రాబిన్ హుడ్ నిరాశపరిస్తే ముందుగా అందరికంటే ఎక్కువ చిక్కుల్లో పడేది నితిన్. ఎందుకంటే నితిన్ కి చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఈ సినిమా కూడా ఆడకుంటే ఇష్క్ కి ముందు నితిన్ కెరీర్ ఎలా ఉండేదో అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. 

Latest Videos

click me!