ఇలా చేస్తే.. కుక్కర్ నుంచి నీళ్లు బయటకు రావు

First Published | Nov 28, 2024, 12:23 PM IST

ప్రెషర్ కుక్కర్ లో ఏవైనా సరే నిమిషాల్లో ఉడికిపోతాయి. దీంతో గ్యాస్ చాలా మటుకు సేఫ్ అవుతుంది. అలాగే తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. అయితే ఈ కుక్కర్ నుంచి వాటర్ ఎక్కువగా లీక్ అవుతుంటుంది. దీనివల్ల కిచెన్ మొత్తం పాడవుతుంది. 

pressure cooker

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ను ఉయోగిస్తున్నారు. నిజానికి ప్రెషర్ కుక్కర్ వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు. ఎందుకంటే ఇది మన వంట పనులను చాలా ఈజీ చేస్తుంది. అలాగే వంటను నిమిషాల్లో పూర్తయ్యేలా చేస్తుంది. 

ప్రెషర్ కుక్కర్ లో అన్నం, పప్పు, చికెన్, మటన్, బిర్యానీతో పాటుగా ఎన్నో రకాల వంటలను చేసుకుని తినొచ్చు. చాలా మంది ప్రెషర్ కుక్కర్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తారు. ఈ ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుంది. అలాగే వంట కూడా తొందరగా పూర్తవుతుంది. కానీ ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగించడంలో కొన్ని సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అందులో వాటర్ లీకేజీ ఒకటి. 

Latest Videos


ప్రెషర్ కుక్కర్ లో వాటర్ లీకేజీ సమస్య 

ప్రెషర్ కుక్కర్ వాటర్ లీకేజీ సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనిలో పప్పు ఉడికించినా, అన్నం ఉడికించినా విజిల్ నుంచి వాటర్ బయటకు వస్తూనే ఉంటాయి. దీనివల్ల స్టవ్ మొత్తం పాడవుతుంది. కిచెన్ మురికిగా మారుతుంది. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. 

ప్రెషర్ కుక్కర్ దెబ్బతినడం వల్ల దాని గ్యాస్కెట్ లూజ్ అవుతుంది. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ ఒత్తిడిని కలిగించలేరు. దీనివల్ల వాటర్ లీక్ అయ్యే సమస్యతో పాటుగా వంట కూడా లేట్ అవుతుంది. అందుకే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పిండిని ఉపయోగించండి

ప్రెషర్ కుక్కర్ విజిల్ నుంచి వాటర్ లీక్ కాకుండా ఉండేందుకు పిండిని ఉపయోగించండి. అవును పిండి ఈ వాటర్ లీకేజీని ఆపడానికి సహాయపడుతుంది. ఇందుకోసం గోధుమ లేదా మైదా పిండిని నీళ్లతో తడిపి మూత చుట్టూ పెట్టండి. దీనివల్ల వాటర్ లీక్ అస్సలు కాదు. 

రబ్బరు గ్యాస్కెట్ ను ఫిక్స్ చేయండి 

మీ ప్రెజర్ కుక్కర్ రబ్బరు గ్యాస్కెట్ పాడైతే దానిని సరిచేయడానికి వేడి నీటిలో కాసేపు దాన్ని ఉంచండి. దీనివల్ల అది ఫ్లెక్సిబుల్ గా అయ్యి ప్రెషర్ కుక్కర్ నుంచి నీళ్లు బయటకు రాకుండా ఉంటాయి. 
 

గ్యాస్కెట్ కు ఆయిల్ అప్లై చేయాలి

చాలా సార్లు గ్యాస్కెట్ పొడిగా మారుతుంది. దీనివల్ల కూడా ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. దీనివల్ల ప్రెషర్ కూడా సరిగ్గా ఉండదు. అందుకే ఈ సమస్య పోవాలంటే ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ అంచులకు నూనెను పెట్టండి. దీనివల్ల గ్యాస్కెట్ తేమగా అవుతుంది. నీరు కూడా లీక్ కాదు. 
 

ఎక్కువ నీళ్లు పోయొద్దు 

కొంతమంది పప్పు, మటన్, చికెన్, ఇతర కూరలు వండేటప్పుడు నీళ్లు చాలవని అవసరమైన వాటికంటే ఎక్కువగా పోస్తుంటారు. కానీ దీనివల్ల కూడా ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతాయి. అందుకే ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్ లో నీళ్లను ఎక్కువగా పోయకూడదు. తడి టవల్స్ ను వాడినా ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ కాదు.

click me!