ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు తరచూ వింటున్నాం. ఈ అక్రమ సంబంధాలు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. అయితే.. వీటిపై తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
undefined
యువ దంపతులతో పోలిస్తే.. లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయన సంస్థ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది
undefined
అయితే ఇదంతా అమెరికా సంగతి మాత్రమే. అక్కడి దంపతుల్లో.. యువ జంటల కన్నా వివాహేతర సంబంధాల్లో వృద్ధ జంటలే ముందున్నారు.
undefined
ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ వెల్లడించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.55 ఏళ్ల లోపు ఉన్న అమెరికన్ జంటల్లో 14శాతం వివాహేతర సంబంధాలు మాత్రమే ఉండగా.. 55 ఏళ్లు పైబడిన వృద్ధ జంటల్లో 20శాతం మంది వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారట.
undefined
సుదీర్ఘ కాలం పెళ్లి బంధంలో ఉండటం వల్ల తమ భాగస్వాములను మోసం చేయడం వీరికి సులువుగా మారిందట.ఓవైపు వృద్ధ జంటల్లో వివాహేతర సంబంధాలు పెరుగుతుంటే.. మరోవైపు యువ జంటల్లో మాత్రం అలాంటి సంబంధాలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
undefined
ఇక బహుభార్యత్వం(పోలియమొరీ), భార్య సమ్మతంతో ఇతరులతో సంబంధం కొనసాగించడం(ఎథికల్ నాన్-మోనోగమి) ఎక్కువగా విస్మరణకు గురవుతున్నాయని తేలింది.
undefined
అయితే అమెరికన్ వృద్ధ జంటల్లో మాత్రం పోలియమొరిస్టులు గణనీయంగానే పెరిగినట్లు అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, వివాహేతర సంబంధాల పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా 30ఏళ్లుగా తమ జీవిత భాగస్వాములను ఈ విషయంలో మోసం చేస్తున్నవారు దాదాపు 16శాతం వరకు ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
undefined