సెక్సువల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్య వయస్కులు, వృద్ధ పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, అలసట, వృద్ధాప్యం వల్ల వీరిలో లిబిడో తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జీవన శైలి మార్పులు లైంగిక పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ లైంగిక జీవితం మెరుగ్గా ఉంటుంది.
తగినంత నిద్ర
కంటినిండా నిద్ర ఉంటేనే మనిషి శారీరకంగా ఆరోగ్యంగా, లైంగికంగా చురుగ్గా ఉంటాడు. కానీ తక్కువ నిద్ర, నిద్రలేమి సమస్యలు ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు రావడమే కాదు సెక్స్ పై కోరికలు కూడా తగ్గిపోతాయి. ఇది తక్కువ లిబిడోకు కూడా దారితీస్తుంది. అందుకే కంటినిండా నిద్రపోయేలా చేసుకోండి.
శారీరక ఆరోగ్యం
అధిక బరువు, స్థూలకాయం వంటివి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాయి. అయితే ఈ స్థూలకాయం వల్ల లైంగిక పనిచేయకపోవడం వంటి లైంగిక సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కలిసి మాట్లాడుకోండి
సంబంధం మెరుగ్గా ఉండాలంటే.. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య లైంగిక కెమిస్ట్రీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే.. మీ భాగస్వామితో చెప్పండి. అవసరమైతే చికిత్స తీసుకోండి.
జింక్
ఓస్టెర్స్, పౌల్ట్రీ, పైన్ గింజలు వంటి జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను బాగా తినండి. ఎందుకంటే ఇవి హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. అలాగే మీ స్టామినాను పెంచుతాయి.
sex life
తర్వగా లేవండి
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేస్తే మీరు వ్యాయామం చేయడానికి సమయం దొరుకుతుంది. ఇది మిమ్మల్ని ఫిట్ గా, ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుంది. అంతేకాదు త్వరగా అలసిపోనివ్వదు. దీంతో మీరు లైంగికంగా చురుగ్గా ఉంటారు.