పెళ్లయిన కొత్తలో ఏ దంపతులైన అన్యోన్యంగా జీవిస్తూ ఆనందంగానే గడుపుతారు కానీ రోజులు గడుస్తున్న కొద్ది వారి మధ్య మనస్పర్ధలు ప్రారంభమవుతాయి దీనికి కారణం భార్యాభర్తల మధ్య అంచనాలు పెరగటం కమ్యూనికేషన్ లేకపోవడం అపనమ్మకం మొదలైనది.
అయితే ఈ పంచ సూత్రాలని పాటిస్తే మీ కాపురం పండంటి కాపురం అవుతుందని అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండి తీరాలి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు.
ఇద్దరూ కూర్చొని చర్చించుకోండి. ఉద్యోగమైన వ్యాపారమైన ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది. అలాగే భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు అజయ్ చేయకూడదు ఇది చక్కని బంధాన్ని పాడు చేస్తుంది. భర్తని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని..
భార్య తను చెప్పినట్లుగా వినాలని భర్త ఎప్పుడు అనుకోకూడదు. అలాగే ఒకరి మీద ఒకరు ఆంక్షలు పెట్టుకోవద్దు. అది మీ బంధాన్ని బలహీన పరుస్తుంది. అలాగే బాధ్యతలు కూడా భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి చూసుకోండి. భార్యవా ఇది నీ బాధ్యత భర్తగా ఇది నీ బాధ్యత అనే గిరి తీసుకొని కూర్చోకండి.
ఎవరికి ఏది వీలైనప్పుడు ఆ పని చేసుకుంటే రేపటి బాధ్యతలు అప్పుడు నెరవేరుతూ ఉంటాయి. మీరు ఎంత పెద్ద ఉద్యోగి అయినా మీ భార్య ఎంత వంటింటి కుందేలు అయినా ఆవిడ సహకారం లేకపోతే మీరు జీవితంలో ఎదగలేరని గుర్తుంచుకోండి. అలాగే మీరు మీ భాగస్వామిని ఎంత ప్రేమించినప్పటికీ తనకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోకి మీరు జొరబడకండి.
వారి సొంత ప్రపంచంలో స్నేహితులతో కానీ బంధువులతో కానీ గడిపినప్పుడు వారికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది అంతేకాకుండా అంతటి స్వేచ్ఛని ఇచ్చిన మీపై గౌరవం రెట్టింపు అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన సూత్రం ప్రేమ, నమ్మకం. మీ భాగస్వామి పై ఈ రెండు ఉంటే ఎంతటి తప్పునైనా క్షమించగలుగుతారు. అలాగే తరచుగా మీ భాగస్వామితో టైం స్పెండ్ చేయడం వలన కూడా మీ బంధం బలపడుతుంది.