Women Masturbation
హస్త ప్రయోగం అనేది మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకునే విషయం. దీనికి ఎలాంటి నియమాలు, పరిమితులు ఉండకూడదు. ఏదేమైనా.. సున్నితమైన సన్నిహిత భాగాలు ఈ ఆనంద చర్యలో పాల్గొన్నప్పుడు, మీరు చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. హస్త ప్రయోగం మీ ఎండార్ఫిన్లను పెంచుతుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే కొన్ని అదనపు కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు మీకు బాగా నిద్రపట్టేలా కూడా చేస్తుంది. కానీ హస్త ప్రయోగం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అవేంటంటే?
Female Masturbations
హ్యాండ్ వాష్
హస్త్రపయోగంలో పాల్గొనడానికి ముందుగా మీరు మీ చేతులను కడుక్కోవాలి. ఎందుకంటే బ్యాక్టీరియా, వైరస్, దుమ్ము, ధూళి, మురికి మీ చేతులకు అంటుకునే అవకాశం ఉంది. హస్తప్రయోగంలో మురికి చేతులను ఉపయోగించడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే చేతులను శుభ్రంగా కడుకున్న తర్వాతే హస్తప్రయోగంలో పాల్గొనాలి.
masturbating
గోర్లు
గోర్లను కూడా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే మీ గోళ్లలో చిక్కుకున్న మురికి.. మీ చేతులను కడుక్కున్నా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాక పెద్దగా ఉండే గోర్లు ప్రైవేట్ భాగాల సున్నితమైన కణజాలంపై రాపిడిని కలిగిస్తాయి. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. శారీరక రాపిడి శరీరంలో మంటలకు దారితీస్తుంది. అలాగే ఎయిడ్స్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అన్నింటికీ మించి గోళ్ళ వల్ల కలిగే ఓపెన్-కట్, గాయం, రాపిడి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది.
బొమ్మల శుభ్రం
హస్తప్రయోగానికి ముందు చేతులను ఖచ్చితంగా కడగాలి. అలాగే లేటెక్స్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేసిన సెక్స్ బొమ్మలను ఉపయోగిస్తున్నట్టైతే వాటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ బొమ్మలకు చాలా దుమ్ము, ధూళి అంటుకుంటాయి. కడగని బొమ్మలను ఉపయోగించడం వల్ల మీకు భయంకరమైన ఇన్ఫెక్షన్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ల్యూబ్
2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో.. బహుళ కందెనల వాడకం యోని కణ పొరను అలాగే పురీషనాళాన్ని దెబ్బతీస్తుందని తేలింది. ఇది లైంగిక సంక్రమణ అంటువ్యాధులను కలిగిస్తుంది. అలాగే చాలా మంది మహిళలు ఒక నిర్దిష్ట కందెనకు అలెర్జీ ప్రతిచర్యను కలిగి ఉంటారు. ఎందుకంటే వారి సన్నిహిత భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే సరైన ల్యూబ్ నే ఎంచుకోవాలి.
కీరదోసకాయలు
కీరదోసకాయల నుంచి అరటిపండ్ల వరకు ఇంట్లోని వస్తువులను కూడా హస్తప్రయోగానికి ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని అస్సలు ఉపయోగించకూడదు. మీరు కొనే పండ్లు, కూరగాయల్లో చాలా వరకు పురుగుమందులు పిచికారీ చేయడంతో పాటు వాటి రవాణా సమయంలో చాలా మంది వాటిని ముట్టకుంటారు. దీనివల్ల వాటికి ఎన్నో రకాల క్రిములు ఉంటాయి. వీటిని అలాగే ఉపయోగిస్తే మీరెన్నో సమస్యల బారిన పడతారు.