సెక్స్ తర్వాత మూడీగా ఉంటున్నారా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

First Published | Aug 11, 2023, 9:45 AM IST

పోస్ట్ సెక్స్ లక్షణాలు లైంగిక ఆనందం లేదా ఉద్వేగం తర్వాత ప్రారంభమవుతాయి. అంతేకాదు ఇవి చాలా కాలం పాటు కూడా ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో దీన్ని కంట్రోల్ చేయొచ్చు. 
 

post sex blues

చాలా మందికి సెక్స్ ఫీల్ గుడ్ యాక్టివిటీ. సంభోగం ఆనందాన్ని ఇవ్వడమే కాదు. అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొందరికి మాత్రం సెక్స్ సమస్యగా మారుతుంది. లైంగిక ఆనందం తర్వాత చాలా మంది జంటలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిని సాధారణంగా "పోస్ట్ సెక్స్ లక్షణం" అని అంటారు. పోస్ట్ సెక్స్ లక్షణాలు లైంగిక ఆనందం లేదా ఉద్వేగం తర్వాత ప్రారంభమవుతాయి. ఇవి చాలా కాలం కొనసాగుతాయి. ఆ సమస్యలేంటి? వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

post sex blues

తలనొప్పి

సెక్స్ సమయంలో లేదా ఆ తర్వాత తలనొప్పి రావడం సహజం. అయితే ఒక వ్యక్తికి మైగ్రేన్ ఉంటే వారు సెక్స్, ఉద్వేగం తర్వాత తలనొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నేషనల్ హెడేక్ ఫౌండేషన్ ప్రకారం.. సంభోగం సమయంలో శరీరం మరింత ఆందోళనకు గురైనప్పుడు మెడ, తల కండరాలలో సంకోచం ఉంటుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. 
 

Latest Videos


post sex blues

ఇలాంటప్పుడు ఏం చేయాలి? 

అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం..  మీకు తలనొప్పి వచ్చిన వెంటనే సెక్స్ లో పాల్గొనడం వెంటనే ఆపేయండి. లేకపోతే అది మరింత ఎక్కువవుతుంది. మీకు మైగ్రేన్ ఉంటే శోథ నిరోధక నొప్పి నివారణను తీసుకోండి. ఒకవేళ మీకు ఈ సమస్య సెక్స్ తర్వాత వస్తే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.
 

post sex blues

ఉబ్బసం

మీకు ఉబ్బసం ఉంటే, దాన్ని పూర్తిగా తగ్గించుకోకపోతే ఇది లైంగిక సంపర్కం సమయంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బిఎంజి ఓపెన్ రెస్పిరేటరీ రీసెర్చ్ ప్రకారం.. ఉబ్బసం.. ఛాతీ బిగుసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, సంభోగం సమయంలో తుమ్ములు వంటి సమస్యలను కలిగిస్తుంది. పరిశోధన ప్రకారం.. ఉబ్బసం శారీరక, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉబ్బసంతో పాటుగా మీరు యాంగ్జైటీతో బాధపడుతుంటే ఉద్వేగం సమయంలో ఉబ్బసం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ సంబంధాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
 

post sex blues

ఈ పరిస్థితిలో ఏం చేయాలి?

సెక్స్ సమయంలో ఉబ్బసాన్ని నివారించడానికి మీ మందులను ఉపయోగించండి. ఆస్తమా పూర్తిగా అదుపులో ఉందో? లేదో? చూడండి. ఇది కాకుండా యాంగ్జైటీ, నిరాశ వంటి పరిస్థితుల నుంచి వీలైనంతవరకు మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి. సంభోగానికి ముందు ఇన్హేలర్ ను ఉపయోగించండి. ఇది ఉబ్బసం ట్రిగ్గర్లను నివారించడానికి సహాయపడుతుంది.

లైంగిక భంగిమలు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి సరళమైన, సాధారణ భంగిమల్లోనే సెక్స్ లో పాల్గొనండి.  మీ ఛాతీపై ఎక్కువ భారాన్ని పెట్టే స్థితికి రావొద్దు. అలాగే వేగవంతమైన సెక్స్ లో చేయొద్దు. వేగాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నించండి. లైంగిక చర్య సమయంలో మీకు ఉబ్బసం వచ్చినట్టైతే వెంటనే ఆపేయాలి. 
 

విచారం లేదా మానసిక స్థితి మార్పులు

సెక్స్ తర్వాత మీకు విచారంగా అనిపిస్తే మీరు పోస్ట్-కోయిటల్ డైస్ఫోరియాతో బాధపడుతున్నట్టే. ఇది ఒక రకమైన సమస్య. దీనిలో తరచుగా మహిళలు శారీరక సంబంధం కలిగి ఉన్న తర్వాత అసంతృప్తి చెందుతారు. అలాగే చాలా మంది మహిళల్లో మూడ్ స్వింగ్స్ కూడా కనిపిస్తాయి. అంతేకాదు వీరు సెక్స్ తర్వాత ఏడుస్తారు కూడా. జనరల్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో .. 230 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 46 శాతం మంది మహిళలు ఏదో ఒక సమయంలో పోస్ట్-కోయిటల్ డైస్ఫోరియాను అనుభవించారు. అలాగే ఈ సమస్య 5% మంది మహిళల్లో చాలా తరచుగా కనిపించింది.
 

దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? 

ఇలాంటి భావోద్వేగ సమస్యలు మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటిని నియంత్రించాలి. దీంతో మీరు శారీరకంగా, మానసికంగా మీ సంబంధాన్ని బలోపేతం చేయొచ్చు. దీని కోసం శృంగారానికి ముందు, తర్వాత లోతైన శ్వాస పద్ధతులను అవలంబించాలి. సంగీతంతో సెక్స్ చేయండి. అలాగే సెక్స్ తర్వాత పాటలు వినండి. 

భావప్రాప్తిని పొందిన తర్వాత వెంటనే భాగస్వామి నుంచి విడిపోవద్దు. వారిని కౌగిలించుకోండి. అలాగే వారితో మాట్లాడండి. మీ భావాలను పంచుకోండి. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి వాటిని ఆశిస్తే దాని గురించి మీ భాగస్వామితో చెప్పండి. అంతేకాదు మీ పోస్ట్ కోయిటల్ డిస్ఫోరియా గురించి కూడా వారికి చెప్పొచ్చు.


యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

రాత్రిపూట శృంగారంలో పాల్గొంటే, ఉదయం లేచిన తర్వాత మీకు చికాకుగా, నొప్పి, దురద, మూత్ర విసర్జనలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇవి యుటిఐ లక్షణాలు. సెక్స్ లో రక్షణను ఉపయోగించకపోవడం లేదా పరిశుభ్రతను విస్మరించడం వల్లే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.  యుటిఐ విషయంలో యోని చర్మం సున్నితంగా మారుతుంది. అంతేకాదు మూత్రాశయ పొరలో వాపు కూడా ఉంటుంది. ఈ సమస్య దీర్ఘకాలం ఉంటే మీ మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం పడుతుంది. 
 

ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? 

జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మీకు యుటిఐ ఉండి జ్వరం, ఒంటి నొప్పులు, జలుబు, యోనిలో అసాధారణ సమస్యలను ఎదుర్కొంటుంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. అలాగే పరిశుభ్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే యుటిఐ సమయంలో ఎలాంటి లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉండండి. లేకపోతే ఇది మరింత ఎక్కువవుతుంది. 

click me!